ఒక అబ్బాయి  ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని  త‌న త‌ల్లికి  ఇదిగో నీకు కాబోయే కోడ‌లు అంటూ ప‌రిచ‌యం కూడా చేశాడు . త‌ల్లి త‌డ‌బడుతూనే కోడ‌లు చ‌క్కగా వుంది అన్నది. క‌ట్ చేస్తే  ఆ అమ్మాయి మ‌ళ్లీ ఇంటికి రాలేదు. అబ్బాయి కాల్ చేస్తే ఫోన్ కూడా లిప్ట్ చేయ‌లేదు. త‌రువాత పూర్తిగా ఆ ప్రేమ బంధం ముణాళ్ల ముచ్చట‌గా ముగిసింది.  ఇదేదో సినిమా క‌ధ‌లా వుంది క‌దా..? కానీ ఇది రణ‌బీర్ క‌పూర్, దీపికాల ప్రేమ క‌ధ‌. ర‌ణ‌బీర్ ప్రేమ క‌ధ‌లో త‌ల్లే విల‌న్ గా మారిన రియ‌ల్ స్టోరి.
రీల్ లైఫ్ లో ట్విస్ట్ ల మాదిరిగానే  దీపికా, ర‌ణ‌బీర్ క‌పూర్ కి రియ‌ల్ లైఫ్ లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఈ మ‌ద్యే వెలుగులోకి వ‌చ్చింది. దీపికాను ర‌ణ‌బీర్ క‌న్నతల్లే వేదించి వేదించి విడిదీసింద‌ని బిటౌన్ లో క‌ధ‌లు క‌ధ‌లుగా చెప్పుకుంటున్నారు.  ఎంతోమందిని ప్రేమించి వారితో తిరిగి ఇపుడు నా కొడుకుని పెళ్లిచేసుకుందామ‌నుకుంటున్నావా...అది నేను బ్రతికివుండ‌గా కుద‌రదంటూ  ర‌ణ‌బీర్ త‌ల్లి నీతు సింగ్ దీపికాతో రోజు గోడ‌వ‌కు దిగేద‌ట‌. గ‌తం గ‌తహా నేను మీ అబ్బాయిని ప్రాణంగా ప్రేమించాన‌ని దీపికా చెప్పి చెప్పి విసిగిపోయి ....చివ‌రికీ ర‌ణ‌బీర్ తో త‌న ల‌వ్ ని క‌టిఫ్ చేసుకుంద‌ని విన‌బ‌డుతున్న క‌ధ‌లో ఒక‌టి. 
��
అయితే ర‌ణ‌బీర్ క‌పూర్ మాత్రం తన త‌ల్లి నీతు సింగ్ నే  వెనుకేసుకొస్తున్నాడు. మా మ‌ద‌ర్ కి దీపికా అంటే చాలా ఇష్టం. మా ప‌ర్సన‌ల్ విష‌యాల్లో త‌ల‌దూర్చవ‌ద్దంటూ మీడియాకు క్లాస్ కూడా పీకుతున్నాడు. ఇపుడు కూడా తల్లినే రైట్ అంటున్నాడుగానీ దీపికాని ఆమె ఎన్నిమాట‌ల‌తో వేదించిందో తెలుసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆమె దూర‌మైంద‌ని .....హీరోగా హిట్స్ కొట్టడం కాదు త‌ల్లి చాటు బిడ్డగా ఇంకేన్నాళ్లు వుంటావు అని ర‌ణ‌బీర్ క‌పూర్ ని   ఉద్దేశించి  కొద్దిమంది అంటున్నారు.  మ‌రి ర‌ణ‌బీర్ క‌పూర్ ఆ మాట‌ల‌కు ఆన్సర్ ఏం చెబుతాడో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: