బాలీవుడ్ లో మాజీ ప్రేమికులు కలిసి ఒక ఐటెం సాంగ్ లోనూ నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ మధ్య కొంత కాలం ప్రేమాయణం నడిచిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇద్దరూ తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు. తమ ప్రేమ వ్యవహరానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కాగా, ఇద్దరూ కలిసి తాజాగా ఒక సినిమాలో ఐటెం సాంగ్ లో కలిసి నటించనున్నారు. సావన్ కుమార్ తక్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సౌతన్’ అనే సినిమాలో ఈ ఇద్దరూ ఒక ఐటెంసాంగ్ లో నటించనున్నారు. ఐటెం సాంగ్ కోసం దర్శకుడు వీరిని సంప్రదించగా ఐటెం సాంగ్ లో నర్తించడానికి సల్మాన్, కత్రినా అంగీకరించినట్లు చెబుతున్నారు.

కాగా, 1983లో వచ్చిన ‘సౌతన్’ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: