టాలీవుడ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదల అయిన “ఇద్దరమ్మాయిలతో” సినిమా అనుకున్న రీతిలో బ్లాక్ బస్టర్ కాకపోవడం, అంతేకాకుండా ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా పై పోస్ట్ మార్టమ్ జరుగుతో౦ది. సాధారణంగా ప్రేక్షకులు బన్నీ సినిమాలో కోరుకొనే యాక్షన్, ఎలిమెంట్స్ ఈ సినిమాలో మిస్ కావడం ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడానికి ప్రధాన కారణం అంటున్నారు.

ఎంత ప్రేమ కధ సినిమాగా తీసినా హీరోయిజాన్ని ఎలివేట్ చేయకపోవడం బన్నీ అభిమానులకు మింగుడుపడటం లేదట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరో కళ్ళముందే హీరో బన్నీ అమలా పాల్ తల్లితండ్రులను విలన్ అతని గ్యాంగ్ తో చంపేయడం అనే సీన్ కధాపరంగా ఆ సినిమాకు అవసరం అయినప్పటికీ ఆ సీన్ లో ఉన్న హీరో బన్నీ చాలా పాసిసివ్ గా, మరొక మాటలో చెప్పాలి అంటే డమ్మీ గా ఉండడం బన్నీ అభిమానులను తీవ్రంగా నిరాశకు లోను చేసిందట. అసలే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ వీక్ అనుకుంటూ ఉంటే ఈ సీన్ ఈ సినిమా సెకండ్ హాఫ్ ను మరింత వీక్ చేసిందని అభిమానుల టాక్.
ఇలాంటి సన్నివేశాలు ఏ మాత్రం ఇమేజ్ లేని హీరోలపై పెడితే బాగుంటుంది కాని హై ఎనేర్జిటిక్ హీరో ఇమేజ్ ఉన్న బన్నీ పై ఇటువంటి సీన్స్ పెట్టడం ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఎంత వరకూ సబబు అంటూ అల్లు అర్జున్ అభిమానులు “ఇద్దరమ్మాయిలతో” సినిమా షాక్ నుండి తేరుకోలేకపోతున్నారట. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా మొదటి రెండు రోజులు ఈ సినిమా కలెక్షన్స్ అనుకున్న స్థాయిలోనే ఉండడంతో నెమ్మదిగా డివైడ్ టాక్ నుండి పోసిటివ్ టాక్ గా సినిమా మారుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: