ఏదైనా ఆడియో ఫంక్షన్‌లో పెద్దలు స్టేజ్ మీద‌కు వ‌చ్చి హీరోను పొగ‌డ‌టం ఆన‌వాయితిగా మారింది. బ‌లుపు ఆడియో ఫంక్షన్‌లో ర‌వితేజాను పొగిడారో, తిట్టారో, వెట‌కారం చేశారో చూస్తున్న ప్రేక్షకుల‌కు అర్ధంకాని ప్రశ్న.

శ్రీనివాస రెడ్డి కో యాంక‌ర్ చేస్తూనే మ‌ధ్యలో చాలా సార్లు టంగ్ స్లిప్ అయి నాలుక్కరుచుకున్నాడు. ర‌వితేజ స్టేజ్ ఫెర్ఫామెన్స్ త‌రువాత కింద‌కు దిగి వెళుతుంటే 'ర‌వితేజ... ర‌వితేజా...' అంటూ పిలిచినా హీరో వినిపించుకోలేదు. వెంట‌నే శ్రీనువాస రెడ్డి గొంతు పెద్దది చేసి 'నాయ‌నా బ‌లుపురాజా' అంటూ స్పీడ్ పెంచ‌టంతో అంద‌రూ స్టన్ అయ్యారు. వెంట‌నే ఏం జ‌రిగింతో తెలుసుకున్న శ్రీనువాస రెడ్డి 'ఛీ..ఛీ..మాస్‌రాజా..' అంటూ స‌వ‌రించుకున్నాడు.

ఇటువంటి బ‌లుపు ఆడియో ఫంక్షన్‌లో కోకొల్లలుగా జ‌రిగాయి. సినిపెద్దలు సైతం సేజ్ పైకి వ‌చ్చి...
- ర‌వితేజ బ‌లుపు మ‌రింత పెర‌గాలి
-సినిమాకు బలుపు ఎంత ఉందో, హీరోను చూస్తేనే అర్ధ అవుతుంది
-ఇప్పుడు ర‌వితేజాకు బ‌లుపు పెర‌గాల్సిన టైం

ఈ మూవీ టైటిల్ పొగ‌డ్తల‌కు విరుధ్ధంగా ఉండ‌టంతో, సినిపెద్దలు విసిరిన మాట‌లు రవితేజ‌పై ఉన్న మ‌మ‌కార‌మో,కోప‌మో అర్ధం కాకుండా పోయింది. పాపం బ‌లుపురాజ ఇలా అడ్డంగా బుక్ అవుతాడ‌ని ఎవ‌రూ ఊహించలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: