అనుకున్న టైంకు మూవీలు రిలీజ్ అవ‌డం లేదు. పెద్ద హీరోల మూవీలు ఒక‌టికి రెండు సార్లు వాయిదాలు ప‌డుతుంది. పెద్ద మూవీల దెబ్బకి చిన్న మూవీలకు ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలో అర్ధం కాని ప‌రిస్థితి. దీంతో సినీ ప్రేక్షకులు ఏ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, ఏ మూవీని చూడాలో అర్ధం కాక పిచ్చేక్కిపోతున్నారు.

ప్రేక్షకుల‌ల్లో నెల‌కొన్న ఈ క‌న్‌ప్యూజ‌నే ప్రొడ్యూజ‌ర్లకు, హీరోల‌కు బాగా క‌లిసివ‌చ్చింది. అస‌లే క‌రువులో ఉన్న సినీ అభిమానుల మ‌ధ్యలోకి ఏదైన మూవీ వ‌స్తే, ఆలోచించకుండా వెళ్ళి థియోట‌ర్లను ఫుల్ చేస్తున్నారు. స‌రిగ్గా ఈ విష‌యమే ఇద్దరమ్మాయిల‌తో పాటు గ్రీకువీరుడు, త‌ఢాఖా, బాద్‌షా లాంటి మూవీల‌కు క‌లిసి వ‌చ్చింది. ఇవే కాకుండా చిన్న మూవీల‌కు ఇది క‌లిసి వ‌చ్చిన విష‌య‌మే.

ఇదే స‌మంలో మ‌న హైద‌రాబాద్ మార్కెట్లో కొంత మందికి భాష తెలియ‌క‌పోయిన హింది మూవీలు చూసుకుంటూ భావంతో స‌ర్ధుకుపోతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ జంజీర్ మూవీ కూడ మెగా అభిమానుల‌కు కొర‌త‌గా క‌నిపిస్తుంది. ప్రొడ్యూజర్లకు ఇదే మంచి టైం అనుకుంటా, అసలే సిని ప్రేక్షకులు కరువులో ఉన్నారు, మ‌రి త్వర‌గా రిలీజ్‌చేసుకునే టైం ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: