బాలకృష్ణ – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో సినిమా వస్తోంది అంటూ గత సంవత్సర కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు తెర దించుతూ రేపు హైదరాబాద్ లో ఆ సినిమా ప్రారంభం అవుతోంది. దర్శకుడు బోయపాటి అయితే తిరుపతి వెంకన్న ను దర్శించుకొని ఈ సినిమా స్క్రిప్ట్ ఆయన పాదాలపై పెట్టి తన ప్రయత్నానికి శ్రీకారం చుట్టేశాడు. కాని ప్రస్తుతం బోయపాటి బాలయ్య తో తీయబోతున్న సినిమా ఏమిటి అంటూ వార్తలు వస్తున్నాయి.

 మొదటగా చాలాకాలం ఈ సినిమా పేరు “రూలర్” గా వినిపించింది. ప్రస్తుతం ఈ సినిమా పేరు “జయసింహ” అంటున్నారు. నేటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ విషయాలతో ఒక పవర్ ఫుల్ పొలిటికల్ మూవీ గా రూలర్ వస్తోంది అని బాలయ్య అభిమానులు భావించారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం “జయసి౦హ” పొలిటికల్ మూవీ కాదు. కొద్ది కొద్ది మార్పులతో “సింహ” కు సీక్వెల్ గా తయారుఅవుతోంది అట. బాలయ్య కూడా సింహ కు సీక్వెల్ గా సినిమా ఉంటే బాగుంటుందని భావించాడట. కాని మూడేళ్ళ నాటి బాలయ్య సింహ సినిమా కొద్దిగా మార్పులు చేసి “జయసింహ” గా చూపెడితే నందమూరి అభిమానులు ప్రేక్షకులు ఆదరిస్తారా..? అనే టాక్ వినిపిస్తోంది. మరోసారి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో బాలకృష్ణ – బోయపాటి లు తప్పటు అడుగు వేస్తున్నారేమో అంటూ వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా ఏడాది తరువాత నందమూరి సింహం బాలకృష్ణ మేకప్ వేసుకొని మళ్ళి కెమెరా ముందుకు వస్తున్నాడు. అన్ని కుదిరితే బాలకృష్ణ కు కలిసివచ్చే సంక్రాంతి కి ఈ సినిమాను తీసుకురావాలని బాలయ్య పట్టుమిధ ఉన్నాడట. అన్నీ బాగున్నాయి కాని బాలయ్య ఏ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తాడు అన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ కు మాత్రం మనసు నయన్ పై ఉన్నా దర్శకుడు బోయపాటి మాత్రం నయనతార కు ఓటు వేయడంలేదట. మరి నందమూరి సింహం తో స్టెప్స్ వేసే హీరోయిన్ ఎవరో తేలాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: