మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త సినిమా ‘బలుపు’. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు తాజాగా విడుదల అయ్యాయి. ఈ సినిమాలోని పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం...!

1)     కాజలు చెల్లివా.... (హల్లో భాయ్స్ అండ్ గర్ల్స్...)

గానం : రవితేజ, ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : భాస్కరభట్ల

హీరో రవితేజ ఈ పాటకు గొంతు కలపడం విశేషం. సాధారణమైన టీజింగ్ సాంగ్ ఇది. సాహిత్యం ఫర్వాలేదనిపించినా సంగీతం గొప్పగా లేదు. ఈ పాట తమన్ పాత పాటలను గుర్తుకుతెస్తుంది. అయితే చిత్రీకరణతో ఆకట్టుకునే విధంగా ఉందీ పాట.

2)     ఏవైందో..

గానం : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గీతామాధురి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్ర్తి

ఎస్పీ బాలు గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. ఆయన గాత్రంతో ఈ పాట విన్నవెంటనే ఆకట్టుకుంటుంది. అలాగే సాహిత్యం చెడగొట్టకుండా ఈ పాటను తమన్ స్వరపరిచిన తీరు బావుంది. ఇది సాహిత్యం మీద గౌరవమో.. లేక బాల సుబ్రమణ్యం మీద తమన్ కు ఉన్న గౌరవమో తెలియదు కానీ ఈ పాట బాగా వచ్చింది. ఈ మెలోడీ తరహా పాటలను ఇష్టపడే వారికి ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచే విధంగా ఈ పాట ఉంది.

3)     లక్కీ లక్కీ రాయ్..

గానం : నవీన్ మాధవ్, ఎం.ఎం.మానసి
సాహిత్యం : భాస్కరభట్ల
ఈ గీతం చాలా ఉషారుగా సాగుతుంది. వింటుంటే ఈ పాట ఐటెం సాంగ్ అని సునాయసంగా గుర్తుపట్టవచ్చు. ‘లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఈజ్ లక్కీ రాయ్’ అనే ఈ పాట లక్ష్మీ రాయ్ మీద చిత్రీకరించి ఉంటారని కూడా మనం చెప్పేయ్యవచ్చు. సంగీతం, సాహిత్యం లు సాధారణంగా ఉన్న పాట ఆకట్టుకునేవిధంగా ఉంది.

4)  పడిపోయానిలా

గానం : సుచిత్ సురేసన్, మేఘ
సాహిత్యం : అనంత శ్రీరామ్

హీరో హీరోయిన్ల మధ్య సాగే గీతంగా ఈ పాట అనిపిస్తుంది. సంగీతం, గాత్రం చాలా ఉషారుగా సాగింది. సినిమాలో సందర్భానుసారం వచ్చే ఈ పాట చిత్రీకరణతో ఇంకా మెప్పించే అవకాశం ఉంది.

5)  పాతికేళ్ల సుందరి..

గానం : మైకా సింగ్, రనైనా
సాహిత్యం : భాస్కరభట్ల

ఈ ఆల్బమ్ లోనే ఈ పాట చాలా ఉషారుగా సాగుతుంది. గాత్రం, సాహిత్యం, సంగీతం ఈ పాటకు చాలా చక్కగా కుదిరాయి. ఈ ఆల్బమ్ లోనే ఈ పాటకు ఎక్కువ అదరణ దక్కుతుంది. అలాగే ఇలాంటి పాటలను మెప్పించడంలో రవితేజ సిద్ధహస్తుడు. కాబట్టి ఈ పాట చిత్రీకరణ తో కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ పాట చాలా ఉషారుగా సాగింది.


బలుపు పేరుకు తగ్గట్లుగానే ఈ అల్బమ్ ఉంది. బలుపు అనే పదానికి సరైన అర్థం చెప్పలేం. అదేవిధంగా ఈ బలుపు పాటలు గురించి కూడా చెప్పలేం. ఎస్.ఎస్.తమన్ ఎలాంటి ప్రదర్శన ఇచ్చాడనేది చిత్రం విడుదల అయ్యేవరకూ పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే ఇందులో చిత్రీకరణతో ఆకట్టుకునే పాటలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, తమన్ తన బలుపు పాటలతో మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: