తమకు కుదిరినప్పుడల్లా సెలబ్రిటీలు తమ అభిమానులతో ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ప్రస్తుతం మీడియా ప్రపంచంలో ఖర్చులేని సాధనంగా మారింది ట్విట్టర్. ఈ ట్విట్టర్ లో రెండు వాక్యాలు పెడితే చాలు ప్రపంచానికి నిమిషాల మీద తెలిసిపోతుంది. అందుకే అమితాబ్ బచ్చన్ నుండి చిన్న హీరోలవరకూ తమ అభిమానులతో అనుసంధానం చేసుకోవడానికి ఈ ట్విట్టర్ ను బాగా ఉపయోగించుకుంటున్నారు.

ఈ పరిస్థితులలో తానూ ఏమి తక్కువ కాదంటూ మరొక నటుడు ఈ పిట్టకూతల (ట్విట్టర్) క్లబ్ లో సభ్యుడిగా చేరిపోతున్నాడు. ఆయనే విశ్వకధానాయకుడు కమల్ హాసన్. ప్రముఖ నటుడు శేఖర్ కపూర్ ప్రోత్సాహంతో కమల్ తన ట్విట్టర్ అకౌంట్ ను మొదలు పెట్టారు. దీని ద్వారా తన అభిమానులకు దగ్గర అవడమే కాకుండా ఎప్పటికి అప్పుడు యువతరానికి అవసరమైన విషయాలపై సలహాలు ఇస్తారట. కాని ఇక్కడే ఉంది ఒక చిక్కు, కమల్ తరచూ రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఆ మధ్య వివాహ వ్యవస్థ కంటే సహజీవన వ్యవస్థే మంచిది అంటూ వ్యాఖ్యలు చేసే సంచలనం సృష్టించాడు కమల్.

మరి ఇటువంటి తన అభిప్రయాలు కూడా తన ట్విట్టర్ లో పెట్టేస్తూ ఉంటే ఇప్పటికే సోషల్ మీడియా వల్ల యువతరం పాడై పోతుంది అని గగ్గోలు పెడుతున్న వారికి కమల్ తన ట్విట్టర్ల ద్వారా రాయబోయే వివాదాస్పద వ్యాఖ్యలు ఎటువంటి సంచలాలకు దారి తీస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: