గబ్బర్ సింగ్ హిట్ తో వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటూ ...డి-డే స్టిల్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన బ్యూటీ శృతిహాస‌న్. నిజానికి గ‌త వారం రోజులుగా వార్తల్లో శృతి  పేరు, ఫేస్ లేకుండా  హెడ్ లైన్స్  లేవు. అంత‌గా  కరాచీ వేశ్య పాత్రలో  ఆమె స్టిల్స్  మాయ చేశాయి. విశేషం ఏంటంటే ఆ స్టిల్స్ కి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి డైరెక్టర్ ఈ సినిమాలో శృతి మేక‌ప్ లేకుండా న‌టించింది...ఆమె యాక్టింగ్ కి అవార్డ్ రావ‌డం ఖాయ‌మ‌నే స‌రికీ ఆడియెన్స్  ఎన్నో ఊహించుకుంటున్నారు.

అయితే ఇపుడు డి-డే స్టిల్స్ ఎంత‌గా ఆమెను ఫేమ్ చేశాయో...అదే స్ధాయిలో ప్రభుదేవా డైరెక్షన్ లో న‌టిస్తున్న రామ‌య్యా వ‌స్తావ‌య్యా టీజ‌ర్స్  డౌన్ చేశాయి శృతిని.
��
అస‌లు విష‌యం ఏంటంటే  నువ్వోస్తానంటే నేనొద్దంటానా సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా  రెండు  ట్రైల‌ర్స్  ప్రమోష‌న్ లోభాగంగా  నెట్ లోకి వ‌ద‌లారు. అందులో స‌మ్ ధింగ్ స‌మ్ ధింగ్ సాంగ్ కి రీమేక్ వెర్షన్ హిప్ హాప్ ప‌మ్మీలో శృతి తేలిపోయింది. త్రిష బాడీ లాంగ్వేజ్,  క్యూట్  స్మైలింగ్ తెలుగు పాట‌కి  ఓ ఎస్సెట్ అయ్యాయి.  కానీ శృతి మాత్రం త్రిషలా ఆ పాట‌లో మెస్మరైజ్ చేయ‌లేక‌పోయింది.
దీంతో శృతిహాస‌న్ అందాల ఆర‌బోత‌కు త‌ప్ప అభిన‌యానికి ప‌నికిరాద‌ని విమ‌ర్శలు గుప్పిస్తున్నారు కొద్దిమంది . మ‌రి ఆ విమ‌ర్శల‌కు గ‌బ్బర్ బేబీ  త‌న న‌ట‌న‌తో స‌మాదానం చెబుతుందో లేక సైలెంట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: