ఒక‌ప్పుడు కాజ‌ల్ చేతిలో ఎప్పుడూ నాలుగైదు సినిమాలుండేవి. రోజుకి మూడు షిప్టుల్లో ప‌నిచేసిన సంద‌ర్బాలున్నాయి. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. కాజ‌ల్ చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అవ‌కాశాలు రాక కాద‌ట‌. వ‌చ్చిన సినిమాల‌ను తానే వ‌దులుకొంటోంద‌ట‌. ఎంత‌మంది

నిర్మాత‌లు సంప్ర‌దించినా ఇప్పుడు నాకు ఖాళీ లేదు... అని చెప్పి త‌ప్పించుకొంటోంద‌ట‌. ఇంత స‌డ‌న్‌గా కాజ‌ల్‌కి ఏమైంది..?  అని ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బహుశా... కాజ‌ల్‌కి పెళ్లిపై మ‌న‌సు మ‌ళ్లిందేమో...అని సెటైర్లు కూడా వేసుకొంటున్నారు.

అయితే కాజ‌ల్ మ‌న‌సు ఇప్పుడు కాస్త విశ్రాంతి కోరుకొంటోంద‌ట‌. త‌న కుటుంబంతో కొన్ని రోజులు గ‌డిపిన త‌ర‌వాత మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అవుదామ‌నే..కాజ‌ల్ ఈ విరామం తీసుకొంద‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: