వ‌రుస విజ‌యాల‌తో గోల్డెన్ లెగ్ అనిపించుకోని స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించిన మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా. అయితే ఈ సుంద‌రికి ఈ మ‌ద్య టాలీవుడ్ లో వ‌రుస‌గా అప‌జ‌యాలు ఎదుర‌వుతున్నాయి. దీంతో అమ్మడు బాలీవుడ్ పై త‌న దృష్టంతా ఫోక‌స్ చేసింది. నిజానికి హిమ్మత్ వాలాపై ఎన్నో అంచ‌నాలు పెట్టుకుంది. ఎలాగైనా ఆ సినిమాతో నార్త్ లో పాగ వేయాల‌ని ట్రై చేసింది. బ‌ట్ ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గర బ‌కెట్ త‌న్నేసింది. దాంతో త‌మ‌న్నాకు దక్షిణాది సినిమాలే దిక్కు అయ్యాయి.

అయితే ల‌క్కీగా ఇపుడు హిమ్మత్ వాలా ద‌ర్శకుడు సాజిద్ ఖాన్ నుంచే ఆమెకు పిలుపు వ‌చ్చింది. సైఫ్ అలీఖాన్ తో అత‌డు డైరెక్ట్ చేయ‌బోతున్న ఓ చిత్రంలో త‌మ‌న్నానే మ‌ళ్లీ హీరోయిన్ గా ఎంచుకున్నాడు. విశేషం ఏంటంటే సైఫ్ తో మిల్క్ బ్యూటీ న‌టించ‌బోతున్న వార్త బ‌య‌ట‌కి రాగానే త‌మ‌న్నాకు మ‌రో ఆఫ‌ర్ వచ్చింది. త్వర‌లో సెట్స్ పైకి వెళ్లనున్న అక్షయ్ కుమార్ సినిమాలోనూ మిల్క్ బ్యూటీ హీరోయిన్ గా ఎంపికైంద‌ట‌.

అయితే సాజిద్ ఆఫ‌ర్ వెనుక త‌మ‌న్నా అండ‌ర్ గ్రౌండ్ మాస్టర్ ప్లాన్ న‌డిపింద‌ని స‌మాచారం. అందుకే బిటౌన్ లో అంత‌మంది హీరోయిన్స్ వున్నా ఫ్లాప్ హీరోయిన్ ని ఎంచుకున్నాడ‌ని బిటౌన్ లో గుసగుస‌. సో ఏది ఏమైనా ..... ఎలా చూసినా ..త‌మ‌న్నా త‌న గోల్ కి త‌గ్గట్టే బిటౌన్ లో పాగ వేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: