మొత్త‌మ్మీద బండ్ల గణేష్ బ్లాక్‌బ‌స్టర్ క‌ల‌ల‌న్నీ మ‌రోసారి మ‌టాష్ అయిపోయాయి. బాద్‌షా సినిమా తీసి - స్వ‌ల్ప న‌ష్టాల‌తో బ‌య‌ట పడ్డ గ‌ణేష్, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాకి మాత్రం ఫుల్లుగా మునిగిపోయాడు. బ‌య్య‌ర్లంతా చుట్టి ముట్టి గోల చేస్తారనే భ‌యంతో రామ్‌చ‌ర‌ణ్ - కొర‌టాల శివ సినిమాని ఆఘ‌మేఘాల మీద ప‌ట్టాలెక్కించేశాడు.

చ‌ర‌ణ్ సినిమా మీకే ఇస్తా... అని బ‌య్య‌ర్ల‌కు చెప్పుకోవ‌డానికి వీలుగా. అయినా స‌రే... గ‌ణేష్ క‌ష్టాల నుంచి బ‌ట‌య‌ప‌డే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. దాంతో గ‌ణేష్‌ని గ‌ట్టున ప‌డేయ‌డానికి స్వ‌యంగా పూరి జ‌గ‌న్నాథ్ రంగంలోకి దిగుతున్నాడ‌ట‌. మ‌ళ్లీ ఓ సినిమా తీసి - ఆర్థికంగా ఆదుకోవాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. ఈసారి త‌క్కువ బ‌డ్జెట్‌లో సినిమా తీసి, ఎక్కువ లాభాలొచ్చేట‌ట్టు చేస్తా

- అని గ‌ణేష్‌కి మాట కూడా ఇచ్చాడ‌ట‌. మ‌రి... గ‌ణేష్ క‌ష్టాలు ఇక‌నైనా గ‌ట్టెక్కుతాయా?  రెండో సినిమా కూడా ఫ‌ట్ట్ మంటే - అప్పుడేం చేస్తాడో?  పూరి ని న‌మ్ముకొంటే కుక్క‌తోక ప‌ట్టుకొని గోదారి ఈదిన‌ట్టే అని గ‌ణేష్‌కి మాత్రం తెలీదా ఏంటి??
 

మరింత సమాచారం తెలుసుకోండి: