ఇంటింటా అన్న‌మ‌య్య‌కు అడుగ‌డుగునా ఆటంకాలే ఎదుర‌వుతున్నాయి. గ‌త నెల‌లో రెండుసార్లు విడుద‌ల తేదీ వాయిదా వేసుకొన్న ఈ చిత్రం... జూన్ 14న వ‌చ్చేందుకు స‌న్నాహాలు చేసుకొంది. అయితే అప్పుడు కూడా ఈ సినిమా వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. కార‌ణం... ఈ సినిమా నిర్మాత య‌ల‌మంచి సాయిబాబు అప్పుల్లో కూరుకుపోవ‌డ‌మే.

చిత్ర న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కూ ఇంకా బ‌కాయిలు చెల్లించ‌లేదట‌. దాంతో కొంత‌మంది డ‌బ్బింగ్ చెప్ప‌డానికి మొరాయిస్తుంటే, మ‌రికొంతమంది స‌హాయ నిరాక‌ర‌ణ‌కూ దిగిపోయారు. దాంతో రీ రికార్డింగ్ ప‌నులు ఆగిపోయాయి. ఈ అప్పులు తీరితే గానీ - అన్న‌మ‌య్య బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని టాలీవుడ్ టాక్‌!
 

మరింత సమాచారం తెలుసుకోండి: