ప‌వ‌న్ క‌ల్యాణ్ ని స‌రికొత్త గెట‌ప్‌లో చూడ‌డానికి ఫ్యాన్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. త్రివిక్ర‌మ్ సినిమాలో ప‌వ‌న్ ఎలా ఉంటాడు?  అత‌ని స్టైలింగ్ ఏవిధంగా ఉండ‌బోతోంది?  అనే విష‌యాల‌పై ఆసక్తిగా ఎద‌రుచూస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు. సినిమాపూర్తి కావ‌స్తున్నా ప‌వ‌న్ ని ఇంత వ‌ర‌కే చూపించ‌లేదు.

మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌లు టీజ‌ర్‌ల‌తో హ‌డావుడి సృష్టిస్తున్నారు. ఎవ‌డు ఫ‌స్ట్‌లుక్ కూడా వ‌చ్చేసింది. మ‌రి ప‌వ‌న్ సినిమాకి ఏమైన‌ట్టు..?ఈ సినిమా టైటిల్ ఇంకా క‌న్‌ఫ్యూజ్‌లో ఉంది. అది తేలిపోతే - టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌డం చిటికెలో ప‌ని. ఎందుకంటే ప‌వ‌న్ సినిమా టీజ‌ర్ సిద్ధ‌మైంది.

కూడా టైటిల్ క‌న్‌ఫామ్ చేశాక‌.. బ‌య‌ట‌కు తీసుకొస్తారు. త్రివిక్ర‌మ్ మార్క్ పంచ్ డైలాగ్‌తో ఈ టీజ‌ర్ ముస్తాబైన‌ట్టు స‌మాచార‌మ్‌. సో... వ‌ప‌న్ ఫ్యాన్స్.. ప్లీజ్ వెయిట్ ఫ‌ర్ మైండ్ బ్లోయింగ్ టీజ‌ర్‌!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: