శ్రుతిహాస‌న్ మంచి క‌థానాయికే కాదు.. సంగీత ద‌ర్శ‌కురాలు కూడా. క‌మ‌ల్ గారాల ప‌ట్టీకి సంగీతంలో మంచి ప‌ట్టు ఉంది. త‌న‌కంటూ ఓ సొంత బ్యాండ్ ట్రూప్ ఉంది. దేశ విదేశాల్లో ఆ ట్రూప్ చాలా ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించింది. ఈనాడు సినిమాకి సంగీతం అందించింది. ఆ త‌ర‌వాత సినిమాల్లో బిజీ అయిపోయింది.

తెలుగు, త‌మిళం, హిందీ అంటూ మూడు చోట్లా తీరిక లేకుండా గ‌డుపుతోంది. అయితే సంగీతంపై మ‌మ‌కారం పోలేదు. త్వ‌ర‌లోనే ఓ వీడియో ఆల్బ‌మ్ రూపొందిచ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. ఇప్ప‌టికే స‌గం ప‌ని పూర్త‌యింద‌ట‌. కాస్త అవ‌కాశం చిక్క‌గానే... ఆ ఆల్బ‌మ్ ప‌నిలో ప‌డిపోతా అని చెప్తోంది. అటు న‌ట‌న‌, ఇటు సంగీతం - మొత్త‌మ్మీద క‌మ‌ల్ కూతురు అనిపించుకొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: