న‌య‌న తార ధైర్యవంతురాలే. బొద్దింక‌లు, బ‌ల్లుల‌కు భ‌య‌ప‌డిపోతుంటారు అమ్మాయిలు.కానీ న‌య‌న మాత్రం అలా కాదు. పాముల‌తో ఆడుకొంటోంది. బుజ్జి క‌న్నా, జిజ్జి జిన్నా అంటూ వాటితో క‌బుర్లు చెబుతోంది. ఇదంతా షూటింగ్ కోసం అనుకొంటే పొర‌పాటే. నిజంగా నిజం. న‌య‌న‌తార - ఉద‌య‌నిథి స్టాలిన్ జంటగా ఓ త‌మిళ చిత్రం తెర‌కెక్కుతోంది.

ప్ర‌స్తుతం కోయంబ‌త్తూరులో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఆ సినిమా సెట్‌లో చిన్న చిన్న పాములున్నాయి. వాటితో న‌య‌న కాసేపు ఆడుకొంది. ఓ పాము పిల్ల‌ని అర‌చేతిలోపెట్టుకొని కాసేపు ఆడుకొంది. ఆ  ఫొటోని ఉద‌య‌నిధి స్టాలిన్ త‌న ట్విట్ట‌ర్‌లో పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: