ఐపీఎల్ బెట్టింగ్ కేసులకు సంబందించిన విచారణలో రోజుకో సేలెబ్రేటి పేరు బయటకు వస్తోంది. ప్రభాస్ సరసన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంలో చేసిన సంజన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామె స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీస్ విచారణ ఎదుర్కోవటానికి రెడీ అవుతోందని సమాచారం. కన్నడ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా చేసిన బెంగళూరుకు చెందిన సంజనకు శ్రీశాంత్‌తో చాలాకాలంగా పరిచయముంది.

సంజనతో మరో నటిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.  స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇరుక్కున్న క్రికెటర్‌ శ్రీశాంత్‌కు ఆమె ఆప్తురాలు కావడంతో సంజనను ప్రశ్నించాలని ముంబయి పోలీసులు భావిస్తున్నారట!. ముంబయి పోలీసులు ప్రాథమికంగా సంజన గురించి వివరాలు కనుక్కున్నారు. ఆమెను విచారించడానికి త్వరలో సమన్లు పంపే అవకాశం ఉంది  అని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో మ్యాచ్‌ల అనంతరం జరిగే పార్టీలకు సంజన తరచూ హాజరవుతుండేదట.

2009లో గోవా డిస్కోథెక్‌లో శ్రీశాంత్‌, సంజన డ్యాన్స్‌ చేస్తూ కెమేరాలకు చిక్కడంతో వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అప్పట్లో వదంతులొచ్చాయి. అయితే ఈ వార్తల్ని సంజన వెంటనే ఖండించింది. ప్రస్తుతం శ్రీ శాంత్  గర్ల ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఈ కేసులో నలిగిపోతూ ఉంటే క్రికెటర్  శ్రీ శాంత్ మాత్రం పడి కేజీల బరువు తగ్గి నిద్రలేని రాత్రులు జైల్లో గడుపుతున్నాడు....
 

మరింత సమాచారం తెలుసుకోండి: