అన‌గ‌న‌గా ఓ హీరో. అత‌నికి ఓ త‌మ్ముడుంటాడు. ఆ త‌మ్ముడు ఓ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్క‌డ ఓ అల్ల‌రి గ్యాంగ్ ఉంటుంది. వాళ్లేమో హీరో త‌మ్ముడు అనికూడా చూడ‌కుండా ర్యాగింగ్ చేస్తారు. అప్పుడు హీరో ఏం చేస్తాడు..? ర‌య్ మంటూ బైక్ మీద వెళ్లి వాళ్ల చ‌మ‌డాలు ఊడ‌దీస్తాడు.

అంతే క‌దా..?  అచ్చం ఇలాగే నిజ జీవితంలోనూ జ‌రిగింది నిఖిల్ త‌మ్ముడిని ఓ కాలేజీలో ర్యాగ్ చేశార‌ట‌. వెంట‌నే మ‌నోడు రియ‌ల్ హీరోగా వెళ్లి వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. నిఖిల్‌... మాపై దౌర్జ‌న్యం చేశాడ‌ని ఆ కాలేజీలోని సీనియ‌ర్ స్టూడెంట్లు ఫిర్యాదు చేస్తున్నారు. నేనేం దౌర్జ‌న్యం చేయ‌లేదు...

ప్రిన్స్‌పాల్‌ని క‌లుసుకోవ‌డానికి వెళ్లానంతే.. అని నిఖిల్ అంటున్నాడు. మొత్త‌మ్మీద నిజ జీవితంలోనూ నిఖిల్ హీరో అయిపోవ‌డానికి ఓ ట్రైల్ వేశాడ‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: