ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ “వన్” సినిమా నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట లకు ఈ సినిమా దర్శకుడు సుకుమార్ నిద్రపట్టకుండా చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ వ్యవహారంలో నెమ్మదిగా చెక్కుతాడు అని పేరున్న సుకుమార్ అతి నెమ్మది తనం వల్ల ఈ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ స్టైలిష్ ఎంటర్టైనర్ కోసం అప్పుడే 45 కోట్ల పైగా ఖర్చు అయిపోయాయని టాక్. ఇందులో మెజారిటీ వాటా హీరో, హీరోయిన్, దర్శకుడు, ఇతరుల పారితోషికాల కింద 55% పైన ఖర్చు అయిపోయి౦దని, మిగిలిన డబ్బు అంతా ఖర్చు పెట్టినా ఇప్పటికీ ఈ సినిమా నిర్మాణం 50% కూడా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు ధాటిపోతుందని నిర్మాతలు భయపడిపోతున్నారట.  

ఈ సినిమాకు సంబంధించి లండన్ లో 45 రోజుల భారీ షెడ్యుల్ ఈ నెల నుండి ఉండడంతో ఈ సినిమా ఖర్చు ఏ రేంజ్ కి ధాటిపోతుందో అర్ధం కాని పరిస్థితిలో నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ఆడియో లాంచింగ్ లు ఇవన్నీ కలుపుకుంటే 60  కోట్ల బడ్జెట్ ను కూడా సరిపోదా అనే దిగులు నిర్మాతలకు ఉందట. మొన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు విడుదల అయిన ఈ సినిమా టిజర్ కు మూడులక్షల పైన హిట్స్ ఒకే రోజు వచ్చి యు ట్యూబ్ టాలీవుడ్ సినిమా రికార్డు లను బద్దలకొట్టినా ఫైనల్ ప్రోడక్ట్ ఎలా వస్తుందో అనే టెన్షన్ నిర్మాతలలో మొదలు అయిందని అంటున్నారు. ఈ సినిమా సేఫ్ గా బయటపడాలి అంటే తొలివారం కలెక్షన్స్ కనీసం 40 కోట్లు మించి రావాలి అని అంత స్టామినా ఈ సినిమాకు ఉందా అంటూ వార్తలు వస్తున్నాయి. ఓవర్ సిస్ కలెక్షన్స్ శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలుపుకుంటే నిర్మాతలు క్షేమంగానే బయటకు వస్తారు కాని ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో ఏమాత్రం తేడా వచ్చినా ఈ మధ్యనే రిలీజ్ అయిన బన్నీ సినిమా “ఇద్దరమ్మాయిలతో” పరిస్థితి లా ఉంటుందని, కేవలం మహేష్ కలెక్షన్స్ స్టామినా మాత్రమే ఈ సినిమా ను రక్షించాలి అని అంటున్నారు.

అవగాహన లోపంతో గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన “ఆరంజ్” సినిమా ఏవిధంగా అనుకున్న బడ్జెట్ మించి చేయి ధాటిపోయిందో అలాగే మహేష్ లేటెస్ట్ మూవీ వన్ బడ్జెట్ రోజురోజుకు అంచనాలు మించి పెరిగిపోవడం నిర్మాతలకు ఒణుకు పుట్టిస్తుందని అంటున్నారు. గత సంవత్సరం కూడా నాగార్జున కలెక్షన్స్ స్థాయి ని మించి నిర్మించిన “డమరుకం”  నిర్మాతకు ఎటువంటి చేదు అనుభవం మిగిల్చిన విషయం తెలిసిందే. అందువల్ల ఈ పరిస్థితులలో దర్శకుడు సుకుమార్ తన చెక్కుడు కార్యక్రమాన్ని ఆపి ఈ సినిమాను అనుకున్న విధంగా దసరా కు కూడా తిసుకురాలేకపోతే సుకుమార్ నిర్మాతలతో ఆడుకుంటున్నట్లే అవుతుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: