అనుకున్న రేంజ్ లో బాద్ షా సూపర్ హిట్ కాకపొయినా, జూనియర్ ఎన్టిఆర్ పరువును మాత్రం ఆ సినిమా ఏమాత్రం దెబ్బ కొట్టలేదు. 40 కోట్ల క్లబ్ లో ఎన్టిఆర్ ను సభ్యుడిగా “బాద్ షా” నిలబెట్టింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం ఎన్టిఆర్ తన కొత్త సినిమాలతో బిజీ గా మారిపోయాడు. ప్రస్తుతం ఇతడి దృష్టి అంతా “రామయ్యా వస్తావయ్యా” సినిమా పై పెట్టి బాద్ షా సినిమాను మించిన కలెక్షన్స్ రాబట్టడానికి దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి కృషి చేస్తున్నాడు.

 ఈ పరిస్థితులలో రచయిత వక్కలంక వంశీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు నిన్న అన్ని ప్రముఖ పత్రికలలోనూ రావడంతో ఎన్టిఆర్ అభిమానులు, సన్నిహితులు భయపడుతున్నారట. ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో జూనియర్ ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు అంటూ స్వయంగా ఎన్టిఆర్ నే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం వక్కలంక వంశీ కొన్నాళ్ళు టివి లలో యాంకర్ గా పనిచేసి, దాని తరువాత ఓ చిన్న సినిమాలో హీరోగా కూడా నటించి అచ్చిరాక పోవడంతో రచయితగా అవతారం ఎత్తి పెద్ద హీరోల సినిమాలకు కధలు అందించే స్థాయి కి ఎదిగాడు. కాని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈయన కధలు రాసిన సినిమాలలో ఎక్కువ శాతం పరాజయం చెందినవే. అటువంటి చేదు అనుభవం వక్కలంక వంశీ ద్వారా ఎన్టిఆర్ కు కూడా ఉంది.

మరి ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తిని హటాత్తుగా దర్శకుడిగా మారిపోవడానికి జూనియర్ ఎందుకు సహకరిస్తున్నాడు అంటూ చాలామంది అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు. కాని ఎన్టిఆర్ మాత్రం తాను వంశీ కి మాట ఇచ్చాను, తన మాట నిలబెట్టుకొని తీరతాను అంటున్నాడట. బహుశా హీరో ప్రభాస్ రచయిత కొరటాల శివ ద్వారా “మిర్చి” సినిమాకు సూపర్ హిట్ అందుకున్నట్లుగా తను కూడా వక్కలంక వంశీ ద్వారా బ్లాక్ బస్టర్ కొడదామని ఎన్టిఆర్ ఆలోచనలు కాబోలు. ఆలోచనలు బాగున్నాయి కాని తేడా వస్తేనే ప్రమాదం. జూనియర్ రిస్క్ లో సక్సస్ కూడా ఉందేమో......

 

మరింత సమాచారం తెలుసుకోండి: