నయనతారకు భయం లేదట, ఎవరికైనా పాముల్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ప్రముఖ హీరోయిన్ నయనతారకు మాత్రం పాములంటే భయం లేదట. ఓ సినిమాలో ఈ మేరకు స్వయంగా పామును పట్టుకుని తనకు భయంలేదన్న విషయాన్ని తేల్చిచెప్పింది.

స్టాలిన్ నయనతార జంటగా నటిస్తున్న ‘ఇదు కదిర్ వేలన్ కాదల్’ అనే చిత్రం షూటింగ్ కోయబత్తూరులో జరుగుతోంది . అక్కడి లొకేషన్లోకి ఓ పాము పిల్ల వచ్చి ఆమె కంటపడింది.వెంటనే దానిని చేతిలోకి తీసుకుని ఆడుకుందట. దానికి “స్నేక్ బాబు” అని పేరు పెట్టిందట.
దీనిని ఫోటో తీసిన హీరో ఉదయనిధి స్టాలిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మొత్తానికి తన ధైర్యాన్ని బహిరంగంగా చాటి చెప్పింది నయనతార. నయన్ సినిమాలోనే హీరోయిన్ కాదు, నిజజీవితంలో కూడా హీరోయినే అని ఈ  సాహసం చాటుతోంది...
 

మరింత సమాచారం తెలుసుకోండి: