హారీష్ శంక‌ర్ ఏ ఏండకు ఆ గొడుగు పట్టడం నేర్చుకున్నాడేమో అనిపిస్తుంది. మొన్నటి వ‌రకు మెగా హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను ఎక్కడికో ఎత్తేసిన హారీష్ శంక‌ర్, త‌న‌ భ‌విత‌వ్యం ఎన్టీఆర్ మూవీతో తెలిపోవ‌డం ఖాయం అని తెలుసుకున్నాక, త‌న నోటి దూకుడును త‌క్కువుగా వాడుతున్నాడు

రామ‌య్యా..వ‌స్తావ‌య్యా.. మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ మూవీ త‌న‌దైన స్టైల్‌లో ప్రమోట్ చేసుకునేందు హ‌రీష్‌ విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నాడు . ఎన్టీఆర్ ఫైట్స్‌,ఎన్టీఆర్ డ్యాన్స్ అన్ని ఫ్యాన్స్ కేక‌లు పెట్టే విధంగా ఉంటాయంటూ ట్వీట్స్ తెగ పెట్టేస్తున్నాడు.

మొన్నటి వ‌ర‌కూ మెగా హీరోని పొగిడిన నోరే, ఇప్పుడు నంద‌మూరిని పొగడ‌టం అభిమానుల‌కు ఇబ్బంది తెప్పించినా, త‌ప్పని ప‌రిస్థితి. అందులోనూ ఈ మూవీ స‌క్సెస్ కావాలంటే హ‌రీష్‌కు పొగ‌డ్తలు త‌ప్పదు మ‌రి. మెగా హీరోకు బ్లాక్ ఇచ్చిన త‌ను, నందమూరికి బ్లాక్ ఇవ్వక‌పోతే అభిమానుల్లో లెక్కులు బ్యాలెన్స్ కావు. అప్పటి వ‌ర‌కూ హ‌రీష్‌కు ఈ ట్వీట్లు త‌ప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: