వచ్చే ఏడాది తాను పెళ్ళిచేసుకోబోతున్నాను అంటూ ఇటీవల అన్నవరంలో ప్రభాస్ స్వయంగా చెప్పడంతో, ప్రభాస్ ఎటువంటి అమ్మాయి ని ఎంచుకుంటాడు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఎంచుకొనబోయే అమ్మాయి రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తుందని వార్తలు వస్తున్నాయి.

నార్నే వారి అమ్మాయి ని ఎన్టిఆర్ పెళ్ళాడాడు. కామినేని వారి అమ్మాయి ని రామ్ చరణ్ ఎంచుకున్నాడు. ఐటి ఇండస్ట్రీ నేపధ్యం లోంచి వచ్చిన అమ్మాయి ని బన్నీ వివాహం చేసుకున్నాడు. దీనితో ప్రభాస్ ఎంపికఎలా ఉంటుందో అనే ఆశక్తికర చర్చ మొదలు అయింది. అందరి హీరోలకు భిన్నంగా ఉండే ప్రభాస్, అందరి హీరోలలా పారిశ్రామిక వాతావరణం నుంచి వచ్చిన అమ్మాయిని కాకుండా రాజకీయ నేపధ్యం గల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి వైపు ప్రభాస్ మొగ్గుచూపుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా ప్రభాస్ పినతండ్రి కృష్ణంరాజు కు రాజకీయ నేపధ్యం ఉండడంతో అదే రంగానికి చెందిన అమ్మాయి ప్రభాస్ కు వధువుగా సరిపోతుందని కృష్ణంరాజు కుటుంబ సభ్యులు అందరూ భావిస్తున్నారట. దీనిని బట్టి చూస్తే ప్రభాస్ రాజకీయం వైపు కూడా చూపులు చూస్తున్నాడా..? అనిపించక మానదు. ఈ సస్పెన్స్ తీరాలి అంటే మరో ఏడాది ఆగాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: