ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ప్రియ‌మ‌ణి అంటే ప్రతి ఒక్కరికీ క్రేజు,మోజు. లీడ్ రోల్‌లో చేసిన మూవీలు అట్టర్‌ప్లాప్ అవ్వడంతో ప్రియ‌మ‌ణి కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. లెటెస్ట్‌గా రిలీజ్ అయిన చండీ మూవీ ట్రైల‌ర్ కూడ‌ ప్రేక్షకుల వ‌ద్దకు చేరుకోలేక పోయింది.

వి.స‌ముద్ర ద‌ర్శకత్వంలో వ‌చ్చిన చంఢీ మూవీలో ప్రియ‌మ‌ణి హీరోయిన్‌. సోషియ‌ల్,పిరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీపైనే ప్రియ‌మ‌ణి ఆశ‌లు పెట్టుకుంది. షారుఖ్‌ఖాన్ చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీలో ఐటెం సాంగ్ చేసినా, అ క్రెడిట్ అంతా షారుఖ్ ఖాన్ ఖాతాలోకి వెళ్ళడం ఖాయం అనుకున్న ప్రియ‌మ‌ణి, ఆ మూవీపై ఆశ‌ల‌ను వ‌దులుకుంది.

ఇండ‌స్ట్రీలో ద‌శాబ్ద కాలం కుమ్మేద్దామ‌నుకున్న ప్రియ‌మ‌ణి క‌ల‌లకు ఇక తెర‌ప‌డ‌టం ఖాయం అని కొంద‌రంటుంటే, ప్రియ‌మ‌ణి ఫ‌ర్ఫెక్ట్ ప్లానింగ్స్ తో మ‌రో యంగ్ హీరో స‌ర‌స‌న‌ జ‌త‌క‌ట్టడానికి రెడీ అవుతుందంటున్నారు మ‌రి కొంద‌రు. ఏదైమైనా ఈ బ్ల్యాక్ బ్యూటీ క‌ష్టాల‌లో ఉండ‌టం అభిమానుల‌కు న‌చ్చలేద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: