ఫిడేల్ బ్రహ్మ మ‌ళ్ళీ అప్‌సెట్ అయ్యాడు. హీరోతో సంబంధం లేకుండా మూవీను ఒంటి చేత్తో లాగేస్తున్న బ్రహ్మానందం రీసెంట్‌గా డిస‌ప్పాయింట్ అయ్యాడు. తాజాగా బాద్‌షా మూవీ క్రెడిట్ అంతా హీరో,ద‌ర్శకులే కొట్టేసి , స‌క్సెస్ మీట్‌లో బ్రహ్మిను కామెడీ చేశారు.

లెటెస్ట్ మూవీ అల్లు అర్జున్‌,పూరీజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన  ఇద్దర‌మ్మాయిల‌తో మూవీలో కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ అంటూ ఏమైనా ఉంటూ అది బ్రహ్మానంద‌మే. అస‌లే ఈ మూవీ హిట్టో,ప‌ట్టో అటు ప్రేక్షకుల‌కూ,  ఇటు ఇండ‌స్ట్రీ పర్సన్స్‌కూ అర్ధం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో బ్రహ్మి అలుగుడు అంతుప‌ట్టడంలేదు.

ఇద్దర‌మ్మాయిల‌తో మూవీలో ఫైట్స్ సూప‌ర్,బ‌న్నీ స్టైల్ ఇంకా సూప‌ర్ అంటూనే బ్రహ్మీని సైలెంట్ చేసారు యూనిట్‌. త్వర‌లోనే ఈ మూవీకు సంబంధించిన స‌క్సెస్ మీట్‌ను పెట్టబోతున్నారు. ఇందులో బ్రహ్మీను పొగుడుతారో,సైలెంట్ చేస్తారో తెలియ‌క, ముందే ఈ అలుగుడు సిగ్నల్స్‌ను బ‌న్నీ,పూరీల‌కు చేరేలా ప్లాన్ చేసుకున్నాడు. బాద్‌షా దెబ్బతో బ్రహ్మీకు బాగా తెలిసివ‌చ్చిన‌ట్టుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: