ర‌వితేజకు వ‌రుస ప్లాపుల‌తో మోక్షం క‌లిగింది. బ‌లుపు మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉండ‌టంతో ఆశ‌ల‌న్నీ ఆ మూవీ పైనే పెట్టుకున్నాడు. త‌న ఇమేజ్ కంటే , గోపిచంద్ మ‌లినేని డైరెక్షన్‌నే ఎక్కువుగా న‌మ్ముకున్నాడు.

త‌ను ఏ క‌థ‌న‌యితే ఎక్కువుగా న‌మ్మాడే, అది బాక్సాపీస్ వ‌ద్ద బోల్తాప‌డ‌టంతో ఇంకేముంది అటువంటి క‌థ‌ల‌ను ఇక ముందు చేయ‌కూడ‌ద‌ని ఫిక్స్ అయ్యాడంట‌. అందుకే బ‌లుపు త‌రువాత త‌న‌ను ఇబ్బంది పెట్టిన క‌థ‌ల‌ను మ‌ళ్ళీ రిపీట్ కాకుండా, అటువంటి స్టోరీల‌ను తీసుకువ‌చ్చే స్టోరీ రైట‌ర్స్‌కు వాటిని బంద్ చేసి, కొత్తవి తీసుకుర‌మ్మని చెబుతున్నాడు.


మొత్తానికి బ‌లుపు మూవీ రవితేజాని స‌క్సెస్ రూటులో తీసుకువెళ్ళక‌పోతే, త‌రువాత ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి. అందుకే త‌న మీద ఉన్న నెగిటివ్‌టాక్‌ను తొల‌గించుకోవ‌డానికి చేసే ప్రయ‌త్నాల‌లో ఒక‌టే, ఈ బ్యాడ్ స్టోరీల‌కు బంద్ చెప్పడం. 

మరింత సమాచారం తెలుసుకోండి: