శ్రేయ పని అయిపోయింద‌నుకుంటున్న టైంలో ఆమెకు దొరికిన సినిమా ప‌విత్ర‌.. ఇప్ఫటివ‌ర‌కు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన శ్రీయ ఈ సినిమాలో వేశ్య పాత్ర చేస్తోంది. జ‌నార్ధన్ మ‌హ‌ర్షి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపైనే శ్రేయ ఆశ‌లు పెట్టుకుంది. దానికి త‌గ్గట్టే ఇప్పటిద‌కా అందాలు ఆర‌బోత‌కే ప‌రిమిత‌మైన శ్రేయ ఆ సినిమాలో ఫ‌స్ట్ టైం న‌టించింద‌ట‌. . ఇప్పటికే రిలీజై ట్రైల‌ర్స్ ...బుల్లితెర‌పై ఓ రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. శ్రేయ జీరో సైజ్ బ్యూటీ, డైలాగ్స్ సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాయి.
అందుకేనేమో ప‌విత్ర శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడు పోయాయి. ఓ ఛాన‌ల్ 1.9కోట్లు పెట్టి మ‌రీ ఈ సినిమా ప్రసార హ‌క్కుల్ని చేజిక్కించుకోంది. ఇంత మొత్తంలో ప‌విత్ర అమ్ముడు పోవ‌డంతో సినిమాపై పాజిటివ్ టాక్ వ‌చ్చేసి డిస్ట్రీబ్యూష‌న్ రైట్స్ కూడా కేకుల్లా అమ్ముడుపోతున్నాయ‌ట‌.

నిజానికి ఈ సినిమా ఫైనాన్షియ‌ల్ ప్రాబ్లమ్స్ తో రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వ‌స్తుంది అంటూ ఓ ప్రచారం వుంది. ఆ వార్తల‌న్ని అవాస్తవాల‌ను చేస్తూ ఈనెల 7న తెలుగుతో పాటు త‌మిళ , మ‌ళ‌యాళ బాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కాబోతుంది పవిత్ర‌.. మ‌రి రీ ఎంట్రీ లాంటి సినిమా అయిన ప‌విత్రతో శ్రేయ ఎంత‌గా మాయ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: