మ‌హేష్ భ‌ట్...ఈ పేరు....అత‌డి డైరెక్ట్ చేసిన సినిమాలు తెలియ‌ని ప్రేక్షకులు బాలీవుడ్ లో వుండ‌రంటే ఎంత మాత్రం అతిశ‌యోక్తికాదు. ఇటు భూతు, అటు ధ్రిల్లర్, మ‌రోవైపు ల‌వ్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే భ‌ట్ ఇపుడు టాలీవుడ్ ప్రొడ్యుస‌ర్స్ ని కాంటాక్ట్ అవుతున్నాడు. ఓ చాన్స్ ఇవ్వమ‌ని అడుగున్నాడు. అదేంటి ఆయ‌న బాలీవుడ్ లో అంత పెద్ద నిర్మాత ,దర్శకుడు క‌ధ అని మీ డౌటు. అదే విష‌యానికొస్తున్నా.
మ‌హేష్ భ‌ట్ చిన్న కూతురు ఆలియాకి న‌టించ‌డం అంటే చాలా ఇష్టం. అందాలు వెండితెర‌పై ఆర‌బోయ‌డం అంటే అంత‌కంటే ఇష్టమ‌నుకోండి. అందుకే అమ్మడి ఏజ్ చిన్నదేగానీ, ఇప్పటికే బికీనీలు, లిప్ లాక్ లు వగైరా ,వ‌గైరా పనుల‌న్నీ మొద‌టి సినిమాలోనే చేసేసి హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.
క‌ర‌ణ్ జోహ‌ర్ డైరెక్ట్ చేసిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది ఆ సినిమాలో కావాల్సిన‌దానికంటే ఎక్కువ గ్లామ‌ర‌స్ గానే క‌నిపించింది. కానీ ఎందుకో ఆ సినిమా త‌రువాత ఆలియా భ‌ట్ కి ఆఫ‌ర్లు మాత్రం రావ‌డం లేదు. నిజానికి దానికో రీజ‌న్ వుంద‌నుకోండి. ఆలియా ఇంకా పిల్లలాగా, మెట్యూరిటీ లేని ఫేసుతో క‌నిపిస్తుంద‌ట‌. అంతేకాదు హీరో ప్రక్కన ప్రెండ్ లాగో, లేక చెల్లెలిగానో అనిపిస్తుంది త‌ప్ప హీరోయిన్ లుక్ లేద‌ట‌. అందుకే ఆలియాకు బాలీవుడ్ లో ఆఫ‌ర్ ఇచ్చే నాధుడు క‌న‌బ‌డ‌టం లేదు.

దీంతో ఈ సుంద‌రి దక్షిణాది సినిమాల‌పై ఫోక‌స్ చేసింది. ఈ మ‌ద్యే ఓ హాట్ హాట్ ఫోటోషూట్ చేయించుకోని పిఆర్ తో, త‌న తండ్రికి పరిచ‌య‌మున్న నిర్మాత‌, ద‌ర్శకుల‌కు పంపింద‌ట‌. ఫోటో షూట్ చూసినా నిర్మాత‌ల‌కు భ‌ట్ కూడా కాల్ చేసి తెలుగులో ఓ ఛాన్స్ ఇవ్వమ‌ని అడుతున్నాడ‌ట‌. మ‌రి ఆ ఫోటో షూట్ చూసైనా భ‌ట్ కూతురికి మ‌న వాళ్లు ఓ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: