హీరోయిన్ గా ఛాన్స్ కొట్టడం అంత ఈజీ కాదు. ఇక ఏకంగా చిరుకి జ‌త‌గా న‌టించ‌డం అంటే పూర్వ జ‌న్మలో ఏదో పుణ్యం చేసుకోని వుండాల‌ని అంటారుక‌దా.? మ‌రి అలాంటి ఫుణ్యం చేసిందో లేదో తెలియ‌దుగానీ బ్రిటిష్ మోడ‌ల్ క‌రిష్మా కొటక్ ఒకేసారి మెగాస్టార్ చిరంజీవితో న‌టించే ఛాన్స్ కొట్టింది. శంక‌ర్ దాదా జిందాబాద్ తో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన ఈ సుంద‌రి ఆ త‌రువాత ఎంద‌క‌నో అంత‌గా ఆఫ‌ర్లు అందుకోలేక‌పోయింది. కాక‌పోతే చిరు హీరోయిన్ గా టాలీవుడ్ చ‌రిత్రలో మిగిలిపోయింది.

ఇక ఆ విషయం ప‌క్కన‌పెడితే చిరుతో న‌టించినా...బికినీ టు లిప్ లాక్ దేనికైనా రెడీ అన్న ఆఫ‌ర్లు ఇచ్చే నాధుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో టీవీ రియాల్టీ షోస్ చేసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. అయితే ఇపుడు క‌రిష్మాకు సడ‌న్ గా ఓ ఛాన్స్ వ‌చ్చింది.

క్రికెట్ కి గ్లామ‌ర్ జోడించ‌డానికి తాపత్రయ‌ప‌డే ఐపీఎల్ లో సోనీ సిక్స్ ఛాన‌ల్ యాంక‌ర్ గా క‌రిష్మా కొటాక్ ఫీల్డులోకి దిగింది. ఈ మ‌ద్య జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో భాగానే సంద‌డి చేసింది. దీంతో సోని ఛాన‌ల్ అమ్మడిని ప‌ర్మినెంట్ గా ఎంప్లాయిగా ఎంచున్నార‌ట‌. మ‌రి ఈ కొత్త అవ‌తారం అయినా మందిరా బేడీలా క‌రిష్మాకు ఓ రెండు ఆఫ‌ర్లు తెచ్చుపెడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: