ఏమైంది ఈవేళ‌తో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన కాజ‌ల్ సిస్టర్ నిషా అగ‌ర్వాల్. పేరులో నిషా వున్నట్టే ఆమె అందంతో కుర్రకారుని కిర్రెక్కించిగ‌ల దు . ఆ విష‌యం ఆమె మొద‌టిసినిమాతోనే ప్రూవ్ చేసింది. .. ఫ‌స్ట్ మూవీలోనే వ‌రుణ్ సందేశ్ తో బెడ్ రూమ్ సీన్స్ లో రెచ్చిపోయి న‌టించింది. ఇప్పటికీ ఆ మైత్రి వ‌నం సీన్స్ కుర్రకారుకి గిలిగింత‌లు పెడుతూనే వుంటాయనుకోండి.

ఆ సినిమా త‌రువాత కూడా వ‌రుస‌గా ఆఫ‌ర్లు అందుకుంటూ కాజ‌ల్ స్టైల్లోనే దూసుకుపోతుంది ఈ సుంద‌రి. ఇంకా చెప్పాలంటే కాజ‌ల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. కానీ నిషాలో చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలు వున్నాయి. ఆ విష‌యం ప‌క్కన పెడితే ఇపుడు వ‌రుణ్ సందేశ్, నిషా అగ‌ర్వాల్ న‌టించిన స‌ర‌దాగా అమ్మాయితో ఫోటోస్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయాయి.

ఏమైంది ఈ వేళ స్టైల్లోనే ఈ సినిమాలో ఈ ఇద్దరి మ‌ద్య రోమాంటిక్ సీన్స్ వున్నాయ‌ని...అవే సినిమాకు యూత్ ని ప‌దిసార్లు వ‌చ్చేలా చేస్తాయని మూవీ యూనిట్ అంటోంది. దీంతో సర‌దాగా అమ్మాయితో పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఛార్మింగ్ గాళ్ ఛార్మి కూడా ఓ ప్రదాన పాత్రలో న‌టించిన ఈ రోమాంటిక్ ఫిల్మ్ ఈనెల 14న రిలీజ్ అవుతోంది. సో వ‌రుణ్, నిషాల రోమాంటిక్ సీన్స్ చూడాలంటే 14 వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల‌న్నమాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: