గత కొద్దిరోజుల తన పై వస్తున్న రకరకాల వార్తలకు నిన్న విజయవాడలో ఒక హాస్పటల్ ప్రరంబోత్సవానికి విచ్చేసిన ప్రిన్స్ మహేష్ క్లారటీ ఇచ్చాడు. తాను మరో పదేళ్ళ వరకూ బాలీవుడ్ వెళ్ళే ప్రశక్తే లేదని, అంతేకాదు రాజకీయాలలోకి వచ్చే ఆలోచనే లేదు. ప్రస్తుతం తన దృష్టి అంతా తెలుగు సినిమాలే అనీ తాను నటిస్తున్న ‘1’ చిత్రానికి కేవలం నాలుగు రోజులలో పడి లక్షలు హిట్స్ రావడం తన అదృష్టమని.

తాను నటిస్తున్న ‘వన్’ సినిమాను ఒక ప్రముఖ ఛానల్ భారీ మొత్తం చెలించి సేటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిందనీ ప్రిన్స్ స్వయంగా చెప్పాడు. పసి పిల్లల వైద్య సంక్షేమ నిమిత్తం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపాడు. తన తండ్రి అంటే తనకు చాలా గౌరవమని ఆయన సినిమాలు రీమేక్ చేసి ఆ సినిమాలు పాడు చేసే ఉద్దేశ్యం లేదని ప్రిన్స్ చెప్పాడు. జేమ్స్ బాండ్ పాత్రలు చేయాలనీ ఉన్నా ప్రస్తుతం ఆ ఆలోచన తనకు లేదని తెలియ చేసాడు .

అంతేకాదు వచ్చే ఎన్నికల సమయం లో తాను హైదరాబాద్ లోనే ఉండను అనీ ఊరు వదిలి వెళ్ళి పోతానని జోక్ చేసాడు ప్రిన్స్ మహేష్. అన్ని విషయాలు ప్రిన్స్ స్వయంగా తెలియచేసాడు కాబట్టి ఇహ ఉహాగానలకు తెర పడినట్లే....

మరింత సమాచారం తెలుసుకోండి: