దిల్‌రాజు జ‌డ్జిమెంట్‌కి జ‌నాల్లో గ‌ట్టి న‌మ్మకం ఉంది. ఆయ‌న ఓ సినిమా తీసినా, కొన్నా - త‌ప్ప‌కుండా ఏదో విష‌యం ఉండే ఉంటుంది.. అని జ‌నాలంతా ఫిక్స‌యిపోతారు. ఆయ‌న ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఇప్పుడాయ‌న ఓ ఆశ్చ‌ర్య‌కర‌మైన అడుగు వేశారు. అస‌లు ఏ మాత్రం ఆశ‌ల్లేని బ‌లుపు సినిమా నైజాం రైట్స్‌ని  కొనేశాడు. దిల్ రాజు ఈ స్టెప్ ఎందుకు తీసుకొన్నాడ‌బ్బా..?  

అని అంద‌రూ తెగ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బ‌లుపు సినిమాలోని కొన్ని పార్ట్స్ దిల్‌రాజు ఈమ‌ధ్యే చూశాడ‌ట‌. దాంతో ఇంప్రెస్ అయిపోయి.. నైజాంని ఫ్యాన్సీ రేట్‌కి కొనేశాడు. ఈ సినిమాపై ఆయ‌న‌కు అంత న‌మ్మ‌కం ఏమిటో..? 
అయితే ఇది కూడా బ‌లుపు నిర్మాత‌ల స‌రికొత్త స్ట్రాట‌జీ అని నమ్ముతున్న‌వాళ్లూ ఉన్నారు. రాజు కొన్నాడు కాబ‌ట్టి..

సినిమాలో త‌ప్ప‌కుండా ఏదో మేట‌ర్ ఉండే ఉంటుంది అని మిగ‌తా ఏరియాలూ తెగ కొని పాడేస్తార‌ని నిర్మాత‌లు వేసిన స్కెచ్ అని చెబుతున్న‌వాళ్లూ ఉన్నారు. దిల్‌రాజు తీసుకొన్న నిర్ణ‌యం క‌రెక్టేనా..?  లేదంటే తొలిసారి ఫ్లాప్‌లో కాలేశాడా?  తెలుసుకోవాలంటే వెయిట్ అండ్ సీ
 

మరింత సమాచారం తెలుసుకోండి: