నేను ప‌వ‌న్‌తో సినిమా చేయ‌ను - ఇదీ పూరి డైలాగ్‌. ప‌వ‌న్‌తో పూరి చేస్తే క‌దా.. - ఇదీ ప‌వ‌న్ అభిమానుల సెటైర్‌!! బ‌ద్రి సినిమాతో ఒక్క‌సారిగా ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించాడు పూరి. అత‌నిలోని ద‌ర్శ‌కుడు బ‌య‌ట‌కు వ‌చ్చాడంటే అది క‌చ్చితంగా ప‌వ‌న్ చ‌ల‌వే! కానీ ఇప్పుడేంటి ఇలా అనేశాడు. ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పూరి ప‌వన్ గురించి మాట్లాడుతూ..

. `ఇక ప‌వ‌న్‌తో సినిమా చేసేది లేదు..` అనేశాడు. ప‌వ‌న్‌కీ పూరీకీ అంత‌లా ఎలా చెడిందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఒక‌వేళ మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయే అనుకోండి. అది మ‌న‌సులో పెట్టుకోకుండా ప‌వ‌న్‌తో సినిమా చేసేది లేదు.. అంటే ఏమిటి అర్థం...?  పూరి లేక‌పోతే ప‌వ‌న్ లేడా?  మ‌రో సినిమా చేయ‌డా?  పూరి కాక‌పోతే వంద మంది పూరిల‌ను త‌యారు చేసే సామ‌ర్థ్యం ప‌వ‌న్‌కి ఉంది. ఇలాంటి అర్థం ప‌ర్థం లేని స్టేట్‌మెంట్లు ఇచ్చి... జ‌నాల దృష్టిని ఆక‌ర్షించాల‌నేది పూరి మాస్ట‌ర్ మైండ్ కావ‌చ్చు. ఫ‌లానా హీరోతో సినిమా చేయ‌ను..

అంటే ఎవ‌రికి న‌ష్టం..?  మోగా ఫ్యాన్స్‌ని యాంటీగా చేసుకొని పూరి ఉద్ధ‌రించేదేమిటి?ప‌వ‌న్‌తో వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్థ‌ల‌ను దృష్టిలో ఉంచుకొనే `ప్ర‌పంచంలో ప్ర‌తి ఎద‌వా.. ప‌వ‌న్ ఫ్యానే` అనే డైలాగ్ రాశాడా??  ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న‌లే త‌లెత్తుతున్నాయి. మొత్త‌మ్మీద ఎలాంటి వివాదాలూ, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలూ లేక చ‌ప్ప‌గా సాగిపోతున్న టాలీవుడ్‌కి కావ‌ల్సినంత మేత వేసేశాడు పూరి.

మరింత సమాచారం తెలుసుకోండి: