సున్నిత‌మైన క‌ధ‌ల‌తో సినిమాలు తీయ‌డంలో బాలీవుడ్ లో డైరెక్టర్ బల్కీ టాప్. గ‌తంలో అమితాబ్ తో చినీక‌మ్, పా చిత్రాల్ని రూపొందించి విమ‌ర్శకుల ప్రశంస‌ల‌తో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు .. ఇపుడు ఆయ‌న బిగ్ బి కోసం మ‌రో స్ర్ర్కీప్ట్ రెడీ చేశాడు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ న‌టించ‌బోతున్నాడు.

అమితాబ్ తో మీరు క‌లిసి న‌టించాలి అని బ‌ల్కీ చెప్పగానే షారుక్ ఓకే అన్నార‌ట‌. గ‌తంలో బిగ్ బి , షారుక్ క‌లిసి క‌భీ ఖుషీ క‌భీ ఘ‌మ్, మొహ‌బ్బతే, భూత్ నాధ్ , క‌భీ అల్విధా న కెహ‌నా లాంటి సినిమాల్లో న‌టించారు. ఇపుడు మ‌రోసారి క‌లిసి న‌టించ‌బోతుండ‌టంతో బిటౌన్ ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు..

ప్రస్తుతం బిగ్ బి స‌త్యాగ్రహి లో న‌టిస్తున్నాడు. అలాగే షారుక్ చెన్నై ఎక్స్ ప్రెస్ ప్రమోష‌న్ ప‌నిలో ప‌డ్డాడు. సో త్వర‌లో ఈ ఇద్దరి కాంబినేష‌న్ లోమూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: