సూర్య సింగం గా వ‌స్తున్నాడు. య‌ముడు చిత్రానికి ఇది రీమేక్‌. అనుష్క, హ‌న్సిక క‌థానాయిక‌లు. హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్‌లు ఇటీవ‌లే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవంత గొప్ప‌గా లేక‌పోయినా.. అందులో సూర్య అరుపులు, కేక‌ల‌తో హోరెత్తించాడు. అంతే కాదు... పంచ్‌లు, ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులూ బాగానే ప‌లికాడు.

స‌వాల్ చేస్తే - శ‌వాల్ లేస్తాయ్ అనేది ఒక‌టి. టేకింగ్ చూస్తుంటే అచ్చం య‌ముడు సినిమాని మ‌ళ్లీ డీవీడీలో పెట్టుకొని మ‌ళ్లీ చూస్తున్న‌ట్టే ఉంది. కాక‌పోతే.. సింగ‌మ్‌ని మించిన యాక్ష‌న్ ఈ సినిమాలో పొందుప‌రిచాయ‌ట‌. విల‌న్లు కూడా న‌లుగురు ఉంటార‌ట‌. ప‌ల్లెటూరి పోలీసు క‌థ య‌ముడు అయితే

అదే పోలీసు విదేశాల‌కు వెళ్తే ఎలా ఉంటుంది?  అనేది సింగం క‌థ అని చెబుతున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 28న ఈ చిత్రం విడుద‌ల కానుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: