ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో జ‌త క‌ట్టాల‌ని కృష్ణ‌వంశీ ఉవ్వీళ్లూరుతున్నాడ‌ని... టాలీవుడ్ టాక్‌!  కృష్ణ‌వంశీలోని క్రియేటివిటీని త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు. ఎవ‌రినైనా త‌న క‌థ‌తో మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌డు. అలాంటి కృష్ణ‌వంశీ -ప‌వ‌న్‌తో సినిమా తీయ‌డం అద్భుత‌మూ, ఆశ్చ‌ర్య‌మూ ఏమీ కాదు.

కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది సాధ్య‌మేనా అన్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే కృష్ణ‌వంశీ పీక‌ల్లోతు ఫ్లాపుల‌తో మునిగిపోయి ఉన్నాడు. మొగుడు దారుణంగా బెడ‌సికొట్టింది. పైసా సినిమా పూర్త‌యినా - బ‌య‌ట‌కు రావ‌డానికి స‌త‌మ‌త‌మ‌వుతోంది. పైగా ఈ సినిమాపై ఎవ‌రికీ అంచ‌నాల్లేవు. ఇలాంటి ప‌రిస్థితిలో కృష్ణ‌వంశీకి ప‌వ‌న్ ఓకే చెప్ప‌డం ఇంచుమించు అసాధ్య‌మే! పైగా కృష్ణ‌వంశీ రూటు వేరు. క‌మ‌ర్షియ‌ల్ పంథా గురించి అస్స‌లు ఆలోచించ‌డు.

దాంతో కృష్ణ‌వంశీ సినిమా అంటే గోడ‌కు కొట్టిన సున్న‌మే అనేది నిర్మాత ఫీలింగ్. పైగా పెద్ద స్టార్ల‌తో ఆయ‌న తీసిన సినిమాలు స‌గం ఫ్లాపులే!  అందుకే ఈ కాంబినేష‌న్ మాట్లాడుకోవ‌డం వ‌ర‌కే త‌ప్ప - సెట్స్‌పైకి వెళ్ల‌ద‌నేది ప‌రిశ్ర‌మ టాక్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: