అలా మొద‌లైందితో ఎంత పేరు తెచ్చుకొందో.. అదంతా వ‌డ్డీతో క‌లిపి జ‌బ‌ర్‌ద‌స్త్ సినిమాతో పోగొట్టుకొంది నందినిరెడ్డి. మూడో సినిమా అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మే అనుకొంటున్న త‌రుణంలో నందిని బిజీగా మారుతోంది. నందినిరెడ్డి - నితిన్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం ఖ‌రారైంది.

ఇప్పుడు రానాతో ఓ సినిమా చేయ‌డానికి నందిని ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై డి.సురేష్‌బాబు తెర‌కెక్కిస్తారు. ఇది ఓ రీమేక్ క‌థ అని తేలింది. జ‌బ‌ర్ ద‌స్త్ సినిమా క‌థ‌ని బాలీవుడ్ నుంచి ఎత్తేసిన నందిని ఈసారి మాత్రం రైట్స్ తీసుకొని చ‌ట్ట‌బ‌ద్దంగా కాపీ చేస్తుంద‌న్న‌మాట‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: