ఎస్.ఎమ్.ఎస్  సినిమాతో తెర‌పైకి వ‌చ్చాడు కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు. ఆ సినిమా ఆర్థికంగా లాభాలు తీసుకురాకపోయినా... సుధీర్‌లోని టాలెంట్‌ని బాగానే చూపించింది. దాంతో రెండో అవ‌కాశం కూడా వ‌చ్చింది. ఇప్పుడు ఒక ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌లో హీరోగా న‌టించాడు. ఈ సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

''మ‌హేష్ ఇచ్చిన స‌ల‌హాల‌తో తొలి సినిమా కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగ‌య్యా. కృష్ణ‌, మ‌హేష్‌ల‌తో సినిమాలు చేయాల‌ని ఉంది. మ‌హేష్‌తో క‌లిసి న‌టించ‌డానికి ఓ అర్హ‌త కావాలి. ఒకొక్క మెట్టూ ఎక్కుతూ చాలా క‌ష్ట‌ప‌డి సూప‌ర్‌స్టార్ అయ్యాడు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం ఎప్పుడు వ‌స్తుందో..? '' అంటున్నాడు. ఎంతైనా బావే క‌దా... మ‌హేష్ ఆ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: