సిల్వర్‌స్క్రీన్ మీద హీరోయిన్‌గా ఎద‌గాలంటే క‌సితో పాటు కూసింత గ‌డ‌స‌రిత‌నం,నేర్పు ఉండాలి. ఇవేమి ప‌ట్టన‌ట్టు అవ‌కాశాలు వ‌స్తున్నాయి క‌దా అని, అంద‌రిని ద‌గ్గరికి తీసుకున్నా, గుడ్డిగా న‌మ్మినా జీవితం అంజ‌లిగా మారిపోతుంది.

సీత‌మ్మవాకిట్లో సిరిమెల్లచెట్టు మూవీతో టాలీవుడ్ ఫేమ‌స్ అయిన అంజ‌లి, నిజ జీవితం హారతిక‌ర్పూర‌మై పోయింది. అంజ‌లి కిడ్నాప్ డ్రామ త‌న‌కు ఎంత వ‌ర‌కు క‌ల‌సి వ‌చ్చిందో తెలియ‌దు కాని, ఇండ‌స్ట్రీ ప‌రంగా త‌న‌ను బాగా వెన‌క్కి నెట్టింది. సైన్ చేసిన‌ మూవీలు కూడ వెన‌క్కి త‌గ్గిపోవ‌డంతో, చేసేది ఏం లేక ఉన్న మూవీల‌తోనే స‌ర్దుకుపోవ‌ల‌సి వస్తుంది.

రీసెంట్‌గా జ‌రిగిన బ‌లుపు ఆడియో ఫంక్షన్‌లో క‌నీసం చిరున‌వ్వు కూడ అంజ‌లి ఫేస్‌లో క‌నిపించ‌లేదు. వెన‌క ఉండి ఎవ‌రో కండిష‌న్స్ పెడుతున్నట్టుగానే ముఖం ముడుచుకొని కూర్చుంది ఫంక్షన్‌లో. ప్యామిలి విష‌యాల నుండి అంజ‌లి ఎలా బ‌య‌ట ప‌డాలి అనేదానిపై త‌ను తీవ్రంగా ఆలోచిస్తుందంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: