క‌లెక్షన్స్‌ల‌తో ఆ హీరోల‌కు ప‌నిలేదు. ఆ ప్యామిలి నుండి ఎవ‌రు వ‌చ్చినా త‌న‌ని మెగా హీరో అంటారు. మ‌నం మాట్లాడుకునేది మెగాప్యామిలి గురించే. నాగ‌బాబు కొడుకు వ‌రుణ్‌తేజ్ డెబ్యూ మూవీ కోసం క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. వ‌రుణ్‌తేజ్‌ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ల ఎంపిక ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు.

మొద‌ట శ్రీకాంత్ అడ్డాల‌,పూరీజ‌గ‌న్నాధ్ ల‌ను అనుకున్నారు. చివ‌రికి వీళ్ళెవ‌రూ ఆ లిస్ట్‌లో లేరు. కాని ప్రొడ్యూజ‌ర్‌గా అశ్వనీద‌త్ ఫిక్స్ అయ్యాడు. కాస్టింగ్ ప‌క్కన పెడితే, ఈ మూవీలో కొడుకుతో పాటు తండ్రి నాగ‌బాబు కూడ కాసేపు క‌నిపిస్తాడ‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే నాగాబాబు ప్రతిరోజు జిమ్‌లో తెగ జిమ్ చేస్తున్నాడంట‌. కార‌ణం అడిగితే సిక్స్‌ప్యాక్ కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాన‌ని ఓ టీవి ఇంటర్వూలో చెప్పాడు.

'ఈ ఏజ్‌లో సిక్స్ ప్యాక్ అవ‌స‌ర‌మా' అంటే జ‌స్ట్ ఫిట్‌నెస్ కోస‌మే అని చెప్పాడు. కాని కొడుకు వ‌రుణ్‌తేజ్ డెబ్యూ మూవీలో కొన్ని నిముషాలు పాటు సిక్స్‌ప్యాక్‌లో నాగ‌బాబు క‌నిసిస్తాడంట‌. అందుకే నాగ‌బాబు సిక్స్‌ప్యాక్ ప్రయ‌త్నాలు ఇండ‌స్ట్రీ టాక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: