క్రేజీ హీరోయిన్ సమంత ప్రవర్తన లో మార్పు వస్తోందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. ప్రస్తుతం సమంతను కలుద్దామని టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, అగ్ర దర్శకులు ప్రయత్నిస్తున్నా సమంత మాత్రం ఎవ్వరినీ కలవడం లేదట. కనీసం కధ వినమని అడుగుతున్నా టైం లేదని చెపుతోందట.

టాలీవుడ్ సినిమా మహారాణిగా వెలుగొందిన సమంత వింత ప్రవర్తన పై కొద్దిగా లోతుగా వెళ్ళి విచారిస్తే ఈ ప్రవర్తన అంతా తన ప్రియుడు సిద్దార్ధ కోసమే అని తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దార్ద పేరు చెపితే తెలుగు నిర్మాతలు పారిపోతున్నారు. కానీ తమిళ నిర్మాతలు మాత్రం ఏదో ఒక సినిమాలో అవకాశాలునెమ్మదిగా సిద్దార్ద కు  ఇస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థుతులలో నెమ్మదిగా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి తాను కూడా సిద్దార్ద తో కోలీవుడ్ సెటిల్ అవ్వాలని సమంతా భావిస్తోందట.

అందుకే తెలుగు సినిమాలకన్నా కొత్తగా తమిళ సినిమాల పైనే దృష్టి పెడుతోందని అనుకోవాలి.  ఈ నిర్ణయం వెనుక తన ప్రియుడు సిద్దార్ద ప్రోద్బలం ఉందని అంటున్నారు. ఎలాగు పెళ్ళి అయిన తరువాత వీరిద్దరూ సెటిల్ అయ్యేది తమిళ్ నాడులోనే కాబట్టి వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు....  

మరింత సమాచారం తెలుసుకోండి: