అందంతో పాటు ఎత్తుగా, నాజుకుగా ఉండే యోగా బ్యూటీ అనుష్క అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వెండితెరపై చిందులు వేస్తూ అనుష్క నటిస్తూ ఉంటే ఇటువంటి అమ్మాయి తనకు ప్రేయసిగా ఉంటే బాగుంటుందని కొందరు భావిస్తే, మరికొందరు పెద్దవాళ్ళు ఇంతఅందమైన అమ్మాయి తమ కూతురుగా ఉంటే బాగుంటుందని భావిస్తూ ఉంటారు. అనుష్క వెండితెర మేజిక్ అలాంటిది. అందుకే నాగార్జున కూడా తనకు ఇష్టమైన హీరోయిన్ అనుష్క అంటాడు.

 అనుష్క లాంటి కూతురు తనకు ఉంటే బాగుంటుంది అని ఒక ప్రముఖ నటుడు అన్నాడు అంటే ఆమె పర్సనాలిటీ ఆ నటుడిని ఎంతగా ఆకర్షించిందో అర్ధం అవుతోంది. ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారా..? తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ నటుడిగా పేరుగాంచిన నాజర్. ప్రస్తుతం అనుష్క కోలీవుడ్ లో సూర్య సరసన “సింఘం-2” లో నటిస్తోంది. ఆ సినిమాలో నాజర్ కూడా నటించాడు. ఈమధ్య జరిగిన ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాజర్ మాట్లాడుతూ “తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అని, కాని తనకు అనుష్క లాంటి కూతురు ఉంటే బాగుంటుంది” అని ఎప్పుడూ అనుకుంటానని చెప్పడం అదే వేదికపై ఉన్న స్వీటీ తో పాటు యూనిట్ సభ్యులను అందరినీ ఆశ్చర్యపరచింది.
 అందుకే కాబోలు మన రాజమౌళి, గుణశేఖర్ లాంటి పెద్ద దర్శకులు వారి భారీ చిత్రాలకు ఏరికోరి అనుష్కను ఎంచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: