ఎప్పుడూ ఏసీ కార్ల‌లోనూ, కేర్ వ్యాన్ల‌లోనూ గ‌డిపే క‌థానాయిక‌ల‌కు ఎండ‌, వ‌డ‌దెబ్బ అంటే ఏం తెలుస్తాయ్‌..?  అనుకొంటాం. వాళ్ల‌కూ కొన్ని క‌ష్టాలుంటాయండీ. మొన్నే స‌మంత `అయ్ బాబోయ్ ఇవేం ఎండ‌లు. న‌ర‌కం చూడాలంటే హైద‌రాబాద్‌లోని ఎండ‌ల్లో రెండు రోజులు తిరిగితే చాలు..

` అంది. ఇప్పుడు తాప్సి కూడా ఇదే మాట చెబుతోంది. అయితే ప్లేస్ మారింది. హైద‌రాబాద్ కాదు. చెన్నైలో. ఓ త‌మిళ చిత్రం షూటింగ్ కోసం తాప్సి చెన్నై వెళ్లింది. అక్క‌డి ఎండ‌ల‌కు తాళ్లలేక‌పోతోంద‌ట‌. చెమ‌ట‌లు తెగ కారిపోతున్నాయ‌ట‌. ఎంత మంచి నీళ్లు తాగినా.. దాహం తీర‌డం లేద‌ట‌. దాంతో..

ఏమీ తిన‌డం లేద‌ట‌. రెండు రోజుల్లోనే మూడు కిలోలు త‌గ్గిపోయింద‌ట‌. ఎప్పుడూ ఏసీ కార్ల‌లో తిరిగితే ఇలాగే ఉంటుంది. అప్పుడ‌ప్పుడూ ఇలాంటి క‌ష్టాలు అనుభ‌విస్తేనే క‌దా.. జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: