ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వున్న సెంటిమెంట్స్ మ‌రెక్కడ వుండ‌వు అన్న  సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కొబ్బరికాయ కొట్టడం ద‌గ్గర నుండి   శుక్రవారం రోజునే సినిమా రిలీజ్ చేయ‌డం వ‌ర‌కు ప్రతి విష‌యంలోనూ ముహు్ర్తాన్ని,సెంటిమెంట్ ని మిక్స్ చేసి కొడ‌తారు సినిమా వాళ్లు. సేమ్ వే మెగా ఫ్యామిలీలో ఓ బిగ్  సెంటిమెంట్ వుంది.

నిజానికి చిరు ఫ్యామిలీకి రెండో సినిమా సెంటిమెంట్ వుంద‌న్న  సంగ‌తి అంద‌రికీ తెలిసిందే కూడా.   అదెలా అంటే  ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండ‌వ చిత్రం గోకులంలో సీతతో తొలి హిట్ కొట్టాడు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రితో స‌క్సెస్ అయినప్పటికీ రెండో సినిమా ఆర్యతోనే అస‌లైన విజ‌యాన్ని అందుకున్నాడు. 

ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్   గురించి చెప్పాల్సిన ప‌నే లేదు.  చిరుత‌తో ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ ద‌గ్గర ప‌ర్వాలేద‌నిపించినా....మ‌గ‌ధీర‌తోనే మెగాస్టార్ కి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. ఇక ఇదే కోవ‌లో అదే కుటుంబం నుండి వ‌చ్చిన అల్లు శిరిష్ తొలిచిత్రం గౌర‌వంతో అట్టర్ ప్లాప్ ని మూట‌గ‌ట్టుకున్నాడు. ఇపుడు రెండో సినిమా   మారుతి డైరెక్షన్ లో కొత్త జంట చేస్తున్నాడు. సెంటిమెంట్ ప్రకారం కొత్త జంట‌తో బ్రేక్ వ‌స్తుంద‌ని ఇటు శిరిష్,అటు ఫ్యామిలీ  ఆశిస్తోంది. మ‌రి రిజ‌ల్ట్ ఎలా వుంటుందో జ‌స్ట్  వెయిట్ అండ్ సీ......

మరింత సమాచారం తెలుసుకోండి: