క్యూట్ గ‌ర్ల్ స‌మంత తాగుబోతు ర‌మేష్ చెంప చెల్లుమ‌నిపించింది. ఆ దెబ్బని ఇప్పటికీ తాగుబోతు ర‌మేష్ మ‌ర‌వ‌లేక‌పోతున్నాడట‌. ఇంత‌కీ తాగుబోతు ర‌మేష్ ఏ చిలిపి ప‌ని చేస్తే  చెంప చెల్లుమ‌న్నదో  తెలుసుకోవాల‌నిపిస్తుందిక‌దా...? అస‌లు విషయం ఏంటంటే ఈగ సినిమాలో తాగుబోతు దొంగ‌త‌నం చేసే సీన్ వుంటుంది. 

ఆ సీన్ లో దున్నపోతులా వున్నావు దొంగ‌త‌నం చేయ‌డానికి సిగ్గు లేదంటూ స‌మంత ఒక్కటిస్తుంద‌ట‌. అయితే స‌మంత చేతికి రింగు వుండ‌టం వ‌ల్ల తాగుబోతు ర‌మేష్ చెంప‌పై దెబ్బ గ‌ట్టిగానే త‌గిలిందట‌. రింగు మ‌చ్చ కూడా ఏర్పడింద‌ట‌. ఆ రింగు మ‌చ్చ, నొప్పి మూడు రోజుల వ‌ర‌కు తాగుబోతు ర‌మేష్ ని వేదించాయ‌ట‌. 

ఇక అప్పటి నుండి ఏ హీరోయిన్ తోనైనా చెంప దెబ్బ సీన్ వుంటే వ్రేలికి వున్న రింగు తీసి కొట్టమంటున్నాడ‌ట‌. ఎందుక‌ని ఆ హీరోయిన్స్ అడిగితే ఈ క‌ధంతా చెబుతున్నాడ‌ట‌. కానీ బ్యాడ్ ల‌క్ ఏంటంటే ఈగ‌లో తాగుబోతు  ర‌మేష్ కి    తీపి  గుర్తుగా మిగిలిపోయిన ఆ చెంప దెబ్బ సీన్ సినిమాలో తేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: