ప్రస్తుతం కోటానుకోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుంటున్న మన యంగ్ స్టారు హీరోలు పరిస్థితి విచిత్రంగా ఉంది. వీరు సినిమాసినిమాకు డిఫరెంట్ లుక్ లో కనపడుతున్నారు కానీ డిఫరెంట్ రోల్స్ చేయలేక పోతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లుఅర్జున్, మహేష్, జూనియర్ ఎన్టీర్, ప్రభాస్ లు నాలుగు ఫైట్స్ ఆరు పాటలు, బ్రహ్మనందం కామెడి ట్రాక్ మూస నుండి బయటకు రాలేకపోతున్నారు. కధ గురించి ఆలోచించవద్దు, సరదాగా సినిమా చూడండి అనే కాన్సెప్ట్ తో యాక్షన్ ఫార్మలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు ఒకరి పై ఒకరు పోటీ పడుతున్నారు. కానీ యాక్షన్ ఫార్మలా గా తీసన సినిమాలు చాలామటుకు పరాజయం చెందినవే. దీనికి ఉదాహరణ ‘షాడో’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలు.

తెలుగు సినిమా అంటే మారణ హోమమం అనే భావనతో సినిమాలు తీయడమే కాకుండా ప్రేక్షకులను ఆ అభిప్రాయంలోనే ఉంచుతున్నారు. నేటి యంగ్ హీరోల వెనక తరం వారు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ కొంత వరకూ మాస్ సినిమాలు చేస్తూనే, డిఫరెంట్ రోల్స్ చేయడానికి ప్రయత్నించారు. దీనికి ఉదాహరణ ‘అన్నమయ్య’, శ్రీ రామదాసు’, ‘బైరవదీపం’, ‘స్వయంకృషి’ లాంటి సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టేసారు. అలాగే తమిళ హీరోలైన విక్రమ్, కమలహాసన్ లాంటి ప్రముఖ హీరోలు కూడా తమ వెరైటీ  సినిమాలతో ఎన్నో విజయాలు సాధించారు.

 పరిశ్రమలో కనీసం ఒక దశాబ్దం తరువాత కూడా నిలిచిపోయే ఒక్క సినిమా కూడా ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలుగా పేరు పొందిన వారు చేయలేక పోతున్నారు. ఎంత సేపు వారి ఆలోచన అంతా మొదటి వారం వసూళ్ళ పైనే ఈ పరిస్థితి ఇలాగే ఉంటే  మన యంగ్ హీరోలు మరో దశాబ్దం తరువాత వచ్చే యువతరానికి వీరి పేర్లు కూడా తెలియని పరిస్థితులో ఉంటారేమో యంగ్ హీరోలు ఆలోచించు కోవాలి.... 

మరింత సమాచారం తెలుసుకోండి: