క‌మ‌ల్‌హాస‌న్‌లానే శ్రుతిహాస‌న్ కూడా స‌క‌ల క‌ళావ‌ల్ల‌భురాలు. సంగీతం, గానం, న‌ట‌న‌, చిత్ర‌లేఖ‌నం ఇలా అన్నీ వ‌చ్చు. డాన్స్ కూడా నేర్చుకొంది. అయినా ఇప్పుడు బ్ర‌హ్మానందం ద‌గ్గ‌ర పాఠాలు నేర్చుకొంది. ఇన్ని తెలిసిన శ్రుతి, బ్ర‌హ్మీ ద‌గ్గ‌ర ఏం నేర్చుకొంది?  అంటారా..?  కామెడీ టైమింగ్ అండీ బాబూ. శ్రుతికి కామెడీ సినిమాలంటే ఇష్టం.

చూసి తెగ ఎంజాయ్ చేస్తుంద‌ట‌. కానీ కామెడీ ఎలా చేయాలో తెలీద‌ట‌. ఆ విష‌యాల‌న్నీ బ‌లుపు షూటింగ్ స‌మ‌యంలో బ్ర‌హ్మీని అడిగి తెలుసుకొంద‌ట‌. ఈ సినిమాలో బ్ర‌హ్మానందం, ర‌వితేజ‌, శ్రుతిహాస‌న్ మ‌ధ్య వినోదాత్మ‌క స‌న్నివేశాలు చాలా ఉన్నాయ‌ట‌. తొలిసారి శ్రుతిహాస‌న్ కామెడీ చేసింది ఈ సినిమాలోనేనట‌. అదంతా బ్ర‌హ్మానందం చ‌ల‌వే అంటోంది. మ‌రి బ్ర‌హ్మీకి గురు ద‌క్షిణ‌గా ఏం ఇచ్చిందో మ‌రి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: