వెండితెర తారామణుల జీవితాలు ఎంత అందంగా కనిపిస్తాయో వారి జీవితాలలోని చీకటికోణాలను చూసినప్పుడు మాత్రం హృదయమున్న ఏ మనిషికైనా జాలికలుగుతుంది. బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య పై అమితాబ్ బచన్ నుండి ఎందరో సేలిబ్రేటీలు వారివారి స్థాయి లో స్పందించారు.ఇదే విషయం పై కన్నడ హీరోయిన్ రమ్య స్పందన మరోలా ఉంది.

ఆమె దృష్టిలో  ప్రతి హీరోయిన్ తన జీవితకాలంలో ఏదో ఒకరోజు ఏడవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అంటోoది. తన  గురించి రూమర్స్ వచ్చినప్పుడు ఇలాగే బాధపడ్డాను అంటూ నటి జీవితం ప్రకాశవంతంగా ఉంటుందనుకోవడం నిజం కాదన్న వాస్తవాలు చెప్పింది కన్నడ హీరోయిన్ రమ్య. అలాగే ఓటమి ఎదురైనప్పుడు సహచరుల హేళనతో మనసు అతలాకుతలంమ అవుతుంది. ఆ మాత్రం దానికి ప్రాణాలు తీసుకోవడం సమంజసం కాదని ఆమె అభిప్రాయం, హీరోయిన్ కు ఉన్న ప్రతిభ, అందం, నటన ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయని కూడా  చెప్పలేం. హిట్ లే ఆమె జీవితాన్ని నిర్ణయిస్తాయని చెబుతోంది రమ్య.

రమ్య మాట్లాడుతూ....హీరోయిన్ గా పరిశ్రమలో కొనసాగడం చాలాకష్టతరం. బయట ఎంత ఉత్సాహంగా, ఆనందంగా కనిపించినా లోపల ఎన్నో కష్టాలు ఉన్నాయన్నది నిజం. జియాఖాన్‌ బలవన్మరణమే ఇందుకు తార్కాణం అంటూ  ఆమెకు మంచి ప్రతిభ, అందం ఉన్నా ఏదో వెలితి. అదృష్టం, హిట్లు లేకపోతే జీవితం తారుమారవుతుంది. దివ్యభారతి, సిల్క్ స్మిత ఇలాంటి వారెందరో గ్లామర్ ప్రపంచాన్ని ఒక ఊపు ఉపి ఎప్పటికీ ఎవ్వరికీ అర్ధం కానీ రీతిలో తమ జీవితాలను ముగించుకున్న వారే. వారి పై తీసిన సినిమాలు తీసిన నిర్మాతలకు కురిసిన కాసుల వర్షం చూస్తే, వారి ఆత్మహత్యలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఒక చేదు నిజాలు లా ఎలా నిలిచిపోయో అర్ధమౌతుంది.. సినీ ప్రపంచంలో ప్రతి హీరోయిన్ ఎదో ఒక విషయంలో ఎదో ఒక రోజు  ఇలా కన్నీళ్ళు పెడుతూ బాధ పడుతూనే ఉంటారేమో...  

మరింత సమాచారం తెలుసుకోండి: