కామెడియన్  వెన్నెల కిషోర్ కు  సుడి తిరుగుతోందా! ఇప్పుడిదే ఎంతో ఆసక్తికర చర్చ టాలీవుడ్ లో, ఎంత కామెడీలో టైమింగ్ ఉన్న నటుడు అయితే మాత్రం, ఇంత త్వరగా దర్శకత్వస్థాయికి ఎదగడం ఒక అదృష్టం అయితే,  ఇప్పుడు ఆయన ముఖ్యపాత్రలు చేస్తున్న సినిమాలు కూడా ఎక్కువగా రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పెద్ద హీరోల సినిమాల్లో హాస్య నటుడు బ్రహ్మనందం తో పాటు  కిషోర్ ఒక తప్పని సరి వ్యక్తి అవుతున్నాడు.

దీని వెనుక ఏం రీజనింగ్ ఉందనేది అంతుబట్టని విషయం! కిషోర్ కన్నా మంచి కామెడియన్స్ ఉన్నా వారికి  అంతగా అదృష్టం కలిసి రావడం లేదు. కిషోర్ తెరకు పరిచయం అయ్యి దాదాపుగా ఎనిమిదేళ్లు పూర్తయినా అతడు చేసిన సినిమాల సంఖ్య తక్కువే! కానీ ఇప్పుడు ఆయనకు దక్కుతున్న ఆపర్లు మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు కిషోర్ ముఖ్యపాత్ర చేసిన 'అతడు , ఆమె ఓ స్కూటర్' రీలీజుకు సిద్ధం అవుతోంది. చాలా త్వరగానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కు వెళ్లింది. అయితే కిషోర్ ను కామెడియన్ గా భరించవచ్చుకానీ...ఒక సినిమా అంతా ఆయనే అయితే... జనాలు భరించగలరా? అనేది ఒక అనుమానాస్పదమైన అంశం. ఇప్పటికే ఇతడి దర్శకత్వంలో వచ్చిన 'జప్ఫా'పై జనాలు భారీగా ఆశలుపెట్టుకుని వెళ్లి భరించ లేక గగ్గోలు పెట్టారు.

మరి ఇప్పుడు ఇతడు హీరోగా చేస్తున్న ప్రయత్నం జనాలను భయపెడుతుందా...లేక ఆకట్టుకుంటుందా...అనేది త్వరలోనే తేలిపోతుంది. బ్రహ్మనందం లాంటి టాప్ కమెడియన్లు కూడా హీరోలుగా నటించిన సినిమాలు పెద్దగా విజయంవంతం అవ్వలేదు అనే చెప్పు కోవాలి. అందువల్ల కిషోర్ చేస్తున్నది సాహసమే.....

మరింత సమాచారం తెలుసుకోండి: