ఇద్ద‌ర‌మ్మాయిల‌తో 2 వ‌స్తుంది.. అంటూ పూరి జ‌గన్నాథ్ భ‌య‌పెట్టేశాడు. ఇప్పుడు ఇంకో సీక్వెల్ గురించి కొత్త క‌బురు ఒకటి వ‌చ్చింది. ప‌విత్ర సినిమా 2 కూడా ఉంటుంద‌ట. జనార్థన మ‌హ‌ర్షి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. శ్రియ ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఎండ్ కార్డ్స్‌లో పార్ల‌మెంటులో ప‌విత్ర - అంటూ ఓ టైటిల్ చూపించారు.

అంటే ప‌విత్ర పార్లమెంట్‌కి వెళ్లి ఏం చేసిందో చూపిస్తార‌నే క‌దా..?  అయితే అలాంటిదేం లేదు.. జ‌స్ట్ ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తి పెంచ‌డానికే అలా చేశార‌ని.. ఇంకొంత‌మంది చెబుతున్నారు. ప‌విత్ర హిట్ అయితే... అప్పుడు జ‌నార్థన మ‌హ‌ర్షి సెకండ్ పార్ట్ గురించి కాస్త సీరియ‌స్‌గా  ఆలోచిస్తాడేమో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: